పవన్ కళ్యాణ్ తో పాట్లు అన్నీ ఇన్నీ కావట!

పవన్ కళ్యాణ్ తో పాట్లు అన్నీ ఇన్నీ కావట!

పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన బ్యానర్ లో సినిమా చేయకపోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిల్ రాజు ఏరి కోరి అతనితో పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలాగే పవన్ తో మరో చిత్రం కూడా సమాంతరంగా జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడు.

పండుగల సాయన్న పాత్ర స్ఫూర్తిగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్ ఉంది. గంటల లెక్కన కాల్షీట్స్ ఇస్తోన్న పవన్ కళ్యాణ్ సెట్లో ఉన్న కాసేపు కూడా పూర్తిగా అందుబాటులో ఉండడం లేదట. ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూ షూట్ చేయనని వెళ్లి పోతున్నాడట. అసలే రోజుల లెక్కన పారితోషికం ఇస్తోన్న నిర్మాతలకి ఈ ధోరణితో చెమటలు పడుతున్నాయట.

మాములుగా పవన్ కళ్యాణ్ కి బాగా పరిచయం ఉన్న దర్శకుడో, నిర్మాతో ఉంటే తప్ప సినిమా చేయడు. కానీ ఈ రెండు చిత్రాలకి పవన్ తో  సాన్నిహిత్యం ఉన్నవారు ఎవరూ లేరు. ఇది సదరు నిర్మాతలకి తగని తలనొప్పిగా మారిందట. అదీ కాక మునుపటిలా పవన్ కేవలం సినిమాకే పూర్తి సమయం కేటాయించక పోవడంతో అతని ధ్యాస ఎక్కడో ఉంటోందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English