'రంగస్థలం' డబ్బులతో వాళ్లేం చేశారంటే..?

'రంగస్థలం' డబ్బులతో వాళ్లేం చేశారంటే..?

'రంగస్థలం' సినిమా చాలా మంది కెరీర్లలో గొప్ప మలుపు. మంచి సినిమాలు తీస్తాడు కానీ.. కమర్షియల్‌గా అవి అంతగా ఆడవన్న విమర్శను తిప్పి కొడుతూ సుకుమార్ ఈ సినిమాతో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇక ఎన్ని హిట్లు కొట్టినా నటుడిగా అంత మంచి పేరేమీ లేని రామ్ చరణ్ ఈ సినిమాతో ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేశాడు. ఇంకా ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో అత్యుత్తమ ప్రతిభను చూపించారు.

ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు వచ్చిన పేరు, డబ్బు అంతా ఇంతా కాదు. దీని కంటే ముందు రెండు పెద్ద సక్సెస్‌లు ఖాతాలో వేసుకున్నప్పటికీ.. రంగస్థలంతో భారీ లాభాలందుకున్నారు ఆ సంస్థ అధినేతలు. అంతకుముందు రెండు సినిమాలతో కలిపి వచ్చిన లాభం కంటే 'రంగస్థలం'తో వచ్చిన లాభమే ఎక్కువ అని సంస్థ వర్గాల సమాచారం.

'రంగస్థలం' తర్వాత ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆ సినిమాతో వచ్చిన డబ్బులతో మైత్రీ అధినేతలు పలు రకాలుగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కొంత భూములు కొనడంతో పాటు హైదరాబాద్ శివార్లలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం కూడా స్థలం తీసుకున్నారు. ఏడాది కిందటి నుంచి ఆ స్కూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చాయని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైత్రీ వాళ్ల స్కూల్ ఆరంభమవుతుందని సమాచారం.

ఇండస్ట్రీ నుంచి విద్యా వ్యాపారం వైపు అడుగులేసి గొప్ప విజయం సాధించిన చరిత్ర మోహన్ బాబుకు ఉంది. ఈ రోజు ఆయన సినిమాల మీద ఆధారపడకుండా గొప్ప స్థాయిలో ఉన్నారంటే విద్యా నికేతనే కారణం. మైత్రీ వాళ్లు కూడా ఎడ్యుకేషన్ బిజినెస్‌లో ఉన్న లాభాల సంగతి తెలిసి ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పినట్లు తెలుస్తోంది. తొలి బ్రాంచ్ విజయవంతమైతే దాన్ని మరింత విస్తరించాలన్నది వారి ప్లాన్ అట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English