నెపోటిజం కామెంట్.. రానా సీరియస్

నెపోటిజం కామెంట్.. రానా సీరియస్

ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. తన మీద చేసే పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ పోస్టులు, కామెంట్ల మీద కూడా రానా స్పందిస్తుంటాడు. తాజాగా ఒక నెటిజన్ అతడి మీద నెగెటివ్ కామెంట్ చేయగా.. దానికి తనదైన శైలిలో బదులిచ్చి ట్విట్టర్ జనాలతో శభాష్ అనిపించుకున్నాడు రానా. ఇంతకీ ఏమైందంటే..

ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తాను పదో తరగతిలో ఫెయిలయ్యానని.. ఐతే అది తన కలను నెరవేర్చుకోవడానికి అడ్డంకి కాలేదని రానా పేర్కొన్నాడు. ఆ హెడ్డింగ్‌తో ఉణ్న వార్త మీద ఓ నెటిజన్ స్పందిస్తూ.. రానా కుటుంబానికి పెద్ద స్టూడియో ఉండటం వల్లే అతను పదో తరగతి ఫెయిలైనప్పటికీ తన కలను నెరవేర్చుకోగలిగాడు అన్న అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఎవరో అనామకుడు కామెంట్ చేశాడని రానా వదిలేయకుండా.. కూల్‌గానే దీటుగా బదులిచ్చాడు.

ఏ పనిలో అయినా నైపుణ్యం సాధించలేదంటే.. వెనుక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా వృథా అని.. దేశంలో ఎన్నో స్టూడియోలు కథల్ని సమర్థవంతంగా చెప్పే కళలో పట్టు కోల్పోయి తెరమరుగైపోయాయని రానా పేర్కొన్నాడు. టాలెంట్ ఉండబట్టే తాను ఇందులో ఎదుగుతున్నానని.. అలాగే తమ సంస్థ కూడా ఇప్పటికీ అప్ టు డేట్‌గా ఉండబట్టే మనగలుగుతోందని రానా చెప్పకనే చెప్పాడన్నమాట.

నిజానికి టాలీవుడ్లో నందమూరి తారకరత్న, దాసరి అరుణ్ కుమార్, అల్లు శిరీష్ సహా చాలామంది వారసులు తమ వెనుక ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక దెబ్బ తిన్న ఉదాహరణలు కోకొల్లలు. వారసత్వం ఎంట్రీ వరకు ఉపయోగపడుతుంది కానీ.. ఆ తర్వాత నిలవాలంటే సొంత టాలెంట్ ఉండాల్సిందే. ఎవరి దాకో ఎందుకు.. రానా సైతం మొదట్లో తడబడ్డవాడే. కానీ ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు ఎంచుకుని, తన ప్రతిభను చాటుకుని ఒక స్థాయిని అందుకున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English