మెగా కుర్రాడిపై ఇలా ప‌గ‌బ‌ట్టేశారేంటో..

మెగా కుర్రాడిపై ఇలా ప‌గ‌బ‌ట్టేశారేంటో..

మెగాస్టార్ కుటుంబం నుంచి యువ హీరోలు వ‌స్తూనే ఉన్నారు. అందులో చాలామంది విజ‌య‌వంత‌మైన వాళ్లే. ఈ జాబితాలోకి చేరాల‌ని ఆశిస్తున్న కొత్త మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడే ఈ కుర్రాడు. ఈ మెగాస్టార్ మేన‌ల్లుడు హీరోగా న‌టిస్తున్న తొలి సినిమా ఉప్పెన‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స‌మ‌ర్పిస్తున్నాడు.

ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇంత‌కుముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ తేదీతో వ‌రుస‌గా పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న కొత్త హీరోకు సోలో రిలీజ్ డేట్ ద‌క్కుతుంద‌ని, దానికి పోటీ ఉండ‌ద‌ని అంతా అనుకున్నారు.

కానీ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి పెద్ద సినిమాలు దానికి పోటీగా రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే అనుష్క సినిమా నిశ్శ‌బ్దంను ఏప్రిల్ 2నే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముందు ఆ సినిమాను జ‌న‌వ‌రి 31కే అనుకున్నారు. త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 20న రిలీజ్ అన్నారు. ఇటీవ‌లే ఏప్రిల్ 2కు రిలీజ్ డేట్ మారుస్తూ అప్ డేట్ ఇచ్చారు. అనుష్క చిన్న స్టారేమీ కాక‌పోవ‌డంతో వైష్ణ‌వ్‌కు ఇబ్బందే అనుకుంటుండ‌గా.. ఇప్పుడు రానా ద‌గ్గుబాటి లైన్లోకి వ‌చ్చేశాడు. అత‌ను హీరోగా తెర‌కెక్కుతున్ను భారీ చిత్రం హాథీ మేరీ సాథీ (తెలుగులో అర‌ణ్య‌) రిలీజ్ డేట్‌ను తాజాగా ప్ర‌క‌టించారు.
ఆ సినిమా కూడా ఏప్రిల్ 2నే రాబోతోంది. ఉప్పెన‌తో పోలిస్తే నిశ్శ‌బ్దం, అర‌ణ్య కొంచెం పెద్ద స్థాయివే. అంచ‌నాలు ఎక్కువ ఉన్న‌వే. మ‌రి మెగా కుర్రాడి గురించి ఆ చిత్రాల బృందాలు ఎందుకు ఆలోచిచంచ‌లేదో.. ఇలా అత‌డి సినిమా మీదికి ఎందుకొస్తున్నాయో.. వీటి పోటీని ఉప్పెన ఎలా త‌ట్టుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English