పవన్-క్రిష్ మూవీపై ఆసక్తికర అప్ డేట్స్

పవన్-క్రిష్ మూవీపై ఆసక్తికర అప్ డేట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘పింక్’ రీమేక్ కంటే కూడా దాని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా మీదే అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడితో పవన్ సినిమా చేయడం అభిమానుల్నే కాదు.. సామాన్య ప్రేక్షకులనూ ఎగ్జైట్ చేసేదే. వీళ్ల కాంబినేషన్ అంత చిత్రమైంది మరి.

పైగా వీళ్లిద్దరూ కలిసి చేస్తున్నది పీరియడ్ ఫిలిం కావడం.. అందులో పవన్ రాబిన్ హుడ్ తరహా దొంగ పాత్ర పోషిస్తున్నాడన్న ప్రచారం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న సమాచారం బయటికి వచ్చినా జనాలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.  ఈ చిత్రం కోసం పవన్ గడ్డం తీసి లుక్ మార్చుకోవడం, చేతిలో ఓ టాటూ కూడా వేసుకోవడం క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఇదిలా ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో పవన్ పాత్ర పేరు వీర అని అంటున్నారు. ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారని.. అందులో ఒక పాత్రకు ఇంతకుముందు కియారా అద్వానీ పేరు ప్రచారంలోకి రాగా.. ఇప్పుడు కీర్తి సురేష్ పవన్‌తో జోడీ కడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి కియారా, కీర్తి ఇద్దరూ ఈ సినిమాలో ఉంటారా.. లేక ఒకరికే చోటుందా అన్నది తెలియదు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొస్తున్నాయి. పవన్‌తో ‘ఖుషి’ సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English