ఆర్ఆర్ఆర్ బిజినెస్ లెక్కలు మైండ్ బ్లోయింగ్

ఆర్ఆర్ఆర్ బిజినెస్ లెక్కలు మైండ్ బ్లోయింగ్

'బాహుబలి' తర్వాత రాజమౌళి అదే స్థాయి భారీ తనంతో తీస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా మొదలైనపుడు.. రాజమౌళి 'బాహుబలి' మ్యాజిక్‌ను రిపీట్ చేయలేడని.. ఆ సినిమా స్థాయిలో దీనికి బిజినెస్ చేసుకోలేడని.. అంత క్రేజ్, హైప్ దీనికి అసాధ్యం అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ డీల్స్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే 'బాహుబలి' కూడా దీనికి దిగదుడుపే అనిపిస్తోంది.

'బాహుబలి'ని మించి ఈ సినిమాకు బిజినెస్ అయ్యేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ బిజినెస్ ఏ స్థాయిలో అవుతుంది.. హిందీలో ఈ సినిమా పట్ల ట్రేడ్ వర్గాల్లో ఏమాత్రం ఆసక్తి వ్యక్తమవుతుంది.. ఉత్తరాదిన క్రేజ్ ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మాత్రం 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన బిజినెస్ ఆఫర్లు.. క్లోజ్ చేసిన డీల్స్ గురించి వస్తున్న వార్తలు షాకింగ్‌గా ఉన్నాయి.

'బాహుబలి: ది బిగినింగ్'కు వచ్చిన వసూళ్లు చూసి విస్తుబోయిన దిల్ రాజు.. 'ది కంక్లూజన్'కు అప్పట్లోనే రూ.50 కోట్ల రేటు పెట్టి ఔరా అనిపించాడు. అప్పుడు అందరికీ అది షాక్. రికవరీ సాధ్యమా అనుకున్నారు. కానీ పెట్టుబడి మీద రూ.20 కోట్ల దాకా లాభం తెచ్చుకున్నాడు రాజు. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' లాంటి మామూలు సినిమానే రూ.40 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వెళ్లిన నేపథ్యంలో ఆయన 'ఆర్ఆర్ఆర్' మీద రూ.75 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడని సమాచారం. ఇది ఫైనల్ ఫిగర్ కాదని.. రేటు ఇంకా పెరగొచ్చని అంటుండటం విశేషం. మూడు జిల్లాలున్న వైజాగ్ ఏరియాకు రాజమౌళి మిత్రుడైన సాయి కొర్రపాటి రూ.30 కోట్లకు హక్కులు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆయన ఇంకో రెండు పెద్ద ఏరియాలు కూడా కొనేసినట్లు వార్తలొస్తున్నాయి. నాలుగు జిల్లాలున్న సీడెడ్ ఏరియా హక్కుల్ని రూ.40 కోట్లకు.. కర్ణాటక మొత్తానికి రూ.50 కోట్లకు సాయికి చెందిన 'వారాహి' సంస్థే హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మిగతా ఆంధ్రా ఏరియాల్లో జిల్లాల వారీగా హక్కులు అమ్ముతున్నారని.. గుంటూరుకు రూ.20 కోట్లు, నెల్లూరుకు రూ.10 కోట్లు రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English