తాప్సీ స్పీడుకి బ్రేకుల్లేవ్

ఒకప్పుడు అవకాశాలే లేక ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో సాటి హీరోయిన్లంతా అసూయపడేలా చేస్తోంది. ఓ రకంగా బాలీవుడ్‌లో తాప్సీ సెన్సేషన్ సృష్టించిందనే చెప్పొచ్చు. ఒక ఔట్‌ సైడర్‌‌ బీటౌన్‌లో ఇంతలా ఎదగడం చిన్న విషయం కాదు. అద్భుతమైన నటనతో అయితేనేమి, చక్కని స్టోరీ సెలెక్షన్‌తో అయితేనేమి.. కన్నుమూసి తెరిచేలోగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. బ్రేకుల్లేని బండిలా బ్యాక్ టు బ్యాక్ చాన్సెస్‌తో దూసుకుపోతోంది.     

హిందీ, తెలుగు, తమిళం అన్నీ కలిసి ప్రస్తుతం తాప్సీ చేతిలో ఏడు సినిమాలున్నాయి. ఇప్పుడు ‘అఫ్వా’ మరో హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సేషనల్ సబ్జెక్ట్స్‌తో సూపర్‌‌ హిట్‌ చిత్రాలు తీసే దర్శకుడు, నిర్మాత అనుభవ్ సిన్హా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సుధీర్‌‌ మిశ్రా దర్శకుడు. ఇదొక ఆంథాలజీ. నాలుగు డిఫరెంట్ కథలు ఉంటాయి. ఓ కథలో తాప్సీ లీడ్ రోల్ చేయబోతోంది.      

అనుభవ్‌తో ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు చేసింది తాప్సీ. ఆమె నటించిన ముల్క్, థప్పడ్‌ సినిమాలు అనుభవ్ డైరెక్షన్‌లోనే వచ్చాయి. షూటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తాప్సీ నటించిన ‘శాండ్‌కీ ఆంఖ్’ చిత్రాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఇవన్నీ సూపర్‌‌ సక్సెస్ అవ్వడంతో వీళ్లిద్దరూ కలిస్తే మంచి సినిమాలు వస్తాయనే పేరొచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లు కలిసి వర్క్ చేయడానికి రెడీ అవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.       

ఈ చిత్రాన్ని కరోనా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నాడు అనుభవ్. ప్యాండమిక్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా ఈ ఆంథాలజీని ప్లాన్ చేశాడు. ఆల్రెడీ నవాజుద్దీన్ సిద్దిఖీ, భూమి పెడ్నేకర్‌‌లను తీసుకున్నాడు. ఇప్పుడు తాప్సీని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. మరికొంత మంది పాపులర్ స్టార్స్‌ని కూడా తీసుకోనున్నాడు. ముఖ్యంగా తాప్సీ నటించడం తనకి చాలా ఆనందంగా ఉందంటున్నాడు.