త్రిషకి అదయినా ఆపదంట

త్రిషకి అదయినా ఆపదంట

బాలీవుడ్‌ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నా కానీ నటించడం మానట్లేదు. గర్భవతులు అయ్యే దాకా హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. కానీ ఇంకా దక్షిణాదిలో ఆ ట్రెండు రాలేదు. ఇక్కడోసారి హీరోయిన్‌కి పెళ్లయిందంటే ఇక ఆమె కెరీర్‌ ఎండ్‌ అయినట్టే. కానీ ఈ ట్రెండుని మారుస్తానంటోంది త్రిష. ఈమెకి పెళ్లి చేయాలని ఇంట్లో అదే పనిగా సంబంధాలు చూస్తున్నారట. పెళ్లి వాయిదా వేయడానికి ఇంతకాలం ఏవో సాకులు చెప్పిన త్రిష ఇప్పుడిక నో అనలేకపోతోందట. 

అయినా కానీ ఆమెకి ఇంకా నటించాలని ఉండడంతో లోకల్‌ కుర్రాడ్ని చూడమని చెప్పిందట. పెళ్లి తర్వాత కూడా తాను నటించడం కొనసాగిస్తానని, అందుకు ఓకే అన్నవాడినే పెళ్లి చేసుకుంటానని నిక్కచ్చిగా చెప్పిందట. ఆమె డిమాండ్లకి తగ్గ వాడిని, తలొంచే వాడిని వెతికే పనిలో త్రిష తల్లి బిజీగా ఉంది. ప్రస్తుతం సీనియర్‌ హీరోలకి సరైన హీరోయిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తనకి అవకాశాలకి లోటు ఉండదని త్రిష భావిస్తోంది. ఈ టైమ్‌లో పెళ్లి చేసుకుని బ్రేక్‌ తీసుకుంటే చాలా నష్టపోతానని అనుకుంటోంది. అందుకే అటు పెళ్లయినా ఇటు కెరీర్‌ బ్రేక్‌ అవకుండా చూసుకుంటానంటోంది. త్రిష మెరుపు కలలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు