'అల వైకుంఠపురములో’ బడాయి మామూలుగా లేదే..

'అల వైకుంఠపురములో’ బడాయి మామూలుగా లేదే..

రెండేళ్ల కిందట ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు చేసిందో తెలిసిందే. నాన్-బాహుబలి ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ.. కొత్త బెంచ్ మార్కును అందుకుంది. కానీ తమది రికార్డు సినిమా అంటూ ఒక్క పోస్టర్ కూడా వేయలేదు చిత్ర బృందం.

తన సినిమాల పోస్టర్ల మీద కలెక్షన్ల ఫిగర్లు వేయొద్దన్న రామ్ చరణ్ పాలసీని అనుసరించి కావచ్చు.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హుందాతనం వల్ల కావచ్చు.. రికార్డుల గురించి అసలు డబ్బా కొట్టుకోవడమే కనిపించలేదు. ఆ విజయాన్ని వాళ్లు పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నది కూడా లేదు. కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదలై ‘రంగస్థలం’ రికార్డును కొట్టేసినట్లుగా చెప్పుకుంటున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. రిలీజైన వెంటనే ఒక సక్సెస్ మీట్ పెట్టారు. తర్వాత విశాఖపట్నంలో సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ పెద్ద ఈవెంట్ చేశారు.

అంతటితో ఆగారా.. నాన్-బాహుబలి రికార్డును కొట్టిన సందర్భంగా మీడియాతో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇవన్నీ సరిపోవని ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో స్పెషల్‌గా ఒక సక్సెస్ మీట్ పెడుతున్నారట. ఒక సినిమాకు ఇన్ని సక్సెస్ సెలబ్రేషన్లు ఏంటన్నది అర్థం కావడం లేదు. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి మొదట్నుంచి ఏ రేంజిలో ప్రచారం చేసుకుంటున్నారో తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ టీందే అతి అంటే.. వాళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో వీళ్లు అతి చేస్తూ వచ్చారు. తొలి రోజే రూ.85 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్ వదలడమే అతి.  ఆ తర్వాత కూడా ఈ ఒరవడి కొనసాగింది.

ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘రంగస్థలం’కు తెలంగాణలో స్పెషల్ షోలు లేవు. టికెట్ల రేట్లు పెంచలేదు. అయినా అది రూ.128 కోట్లతో రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో అడ్వాంటేజీని ఉపయోగించుకుంటూ టికెట్ల రేట్లు, షోలు పెంచుకుని రికార్డు కొట్టేసి వీళ్లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక కంటెంట్ పరంగా చూస్తే ‘రంగస్థలం’తో ‘అల..’కు అసలు పోలిక ఎక్కడైనా ఉందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English