‘గ్యాంగ్ లీడర్‌’ భామను అలా చూడలేకపోతున్నారు

‘గ్యాంగ్ లీడర్‌’ భామను అలా చూడలేకపోతున్నారు

కొందరు హీరోయిన్లు ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్ర వేస్తారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అభిమాన గణాన్ని సంపాదించుకుంటారు. ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో లావణ్య త్రిపాఠి అలాంటి ముద్రే వేసింది. ‘అందాల రాక్షసి’ తర్వాత లావణ్య ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని విజయాలందుకుంది.. ఏ స్థాయికి చేరుకుంది అన్నది పక్కన పెడితే.. ఆ సినిమాతో మాత్రం ఆమె కుర్రాళ్ల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఇలాంటి హీరోయిన్లు మరికొందరు కనిపిస్తారు.

 గత ఏడాది ‘గ్యాంగ్ లీడర్’తో పరిచయం అయిన మలయాళ భామ  ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అనుకున్నంతగా ఆడకపోయి ఉండొచ్చు కానీ.. అందులో ప్రియాంకను చూసి మతులు పోగొట్టుకున్న కుర్రాళ్లు చాలా మందే ఉన్నారు.

హీరోయిన్లను చాలా అందంగా చూపించే విక్రమ్ కుమార్.. ‘గ్యాంగ్ లీడర్’లో ప్రియాంకను సైతం భలేగా ప్రెజెంట్ చేశాడు. అందులో ఆమె చాలా సింపుల్‌ లుక్‌లోనే కనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి అబ్బాయీ ప్రేమించాలని అనుకునేలా కనిపించింది ప్రియాంక అందులో. ఈ సినిమా చూసి లక్షల మంది తెలుగు కుర్రాళ్లు ప్రియాంకకు గుండెల్లో గుడి కట్టేశారు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లోనూ నటిస్తోంది.

అలాగే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలోనూ నటిస్తున్న ప్రియాంక.. తమిళంలోనే ‘మాయన్’ పేరుతో మరో సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం కొత్త అవతారం ఎత్తింది ప్రియాంక. శివ భక్తురాలిగా గాడీ మేకప్‌తో, వయొలెంట్ లుక్స్‌తో ఆమె భయపెడుతోంది.

తన ట్విట్టర్ పేజీలో ఈ లుక్‌తో ఫొటోలు పెట్టగా.. వామ్మో అంటూ ఆమె అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. చాలా సెన్సిటివ్‌గా కనిపించే ప్రియాంకను ఇలాంటి లుక్‌లో చూడలేమని.. ఇలాంటి పాత్రలు చేయొద్దని.. ఈ ఫొటోలు తీసేయమని అభిమానులు డిమాండ్లు చేస్తుండటం గమనార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English