త్రివిక్రమ్‌ కోసం టాప్‌ హీరోల క్యూ

త్రివిక్రమ్‌ కోసం టాప్‌ హీరోల క్యూ

అజ్ఞాతవాసి డిజాస్టర్‌ అయినపుడు గురూజీ పని అయిపోయిందంటూ కామెంట్లు చేసారు. అరవింద సమేత కూడా అంతగా ఆడనపుడు ఇక త్రివిక్రమ్‌ మ్యాజిక్‌ అయిపోయిందనే అనుకున్నారు. అల్లు అర్జున్‌ కోసం కూడా ఆరు నెలలకి పైగా వేచి చూడాల్సిన సిట్యువేషన్‌ వచ్చేసిన తర్వాత త్రివిక్రమ్‌ 'అల వైకుంఠపురములో'తో తన సత్తా ఏమిటనేది మళ్లీ చూపించాడు.

త్రివిక్రమ్‌ తీసే ఫ్యామిలీ సినిమా క్లిక్‌ అయితే ఎలాగుంటుందనేది ఈ చిత్రం నిరూపించింది. దీంతో త్రివిక్రమ్‌తో పని చేయడానికి పలువురు అగ్ర హీరోలు ఇప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. తదుపరి చిత్రాన్ని తారక్‌తో చేయాలని త్రివిక్రమ్‌ ముందే కమిట్‌ అయ్యాడు. చాలా కాలంగా పెండింగ్‌లో వున్న మహేష్‌ ప్రాజెక్ట్‌ కూడా త్వరలో ముందుకి కదలవచ్చునని అంటున్నారు. అలాగే ప్రభాస్‌ కూడా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ఇదే తగిన తరుణమని భావిస్తున్నాడు.

చరణ్‌ చాలా కాలంగా త్రివిక్రమ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. వెంకటేష్‌, చిరంజీవితో కూడా చేస్తానని త్రివిక్రమ్‌ మాట ఇచ్చినా కానీ ఇప్పుడున్న బిజీలో వెటరన్‌ హీరోల జోలికి వెళ్లకపోవచ్చు. త్రివిక్రమ్‌ ఇక నాని, విజయ్‌ దేవరకొండ రేంజ్‌ హీరోలకి దిగి వస్తాడని అనుకునేవారు కానీ ఇప్పట్లో అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తనతో చేయాలనుకుంటోన్న అగ్ర హీరోలతోనే త్రివిక్రమ్‌కి అయిదేళ్లకి పైగా సమయం గడచిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English