డిస్‌కనక్ట్‌ రాజా!

డిస్‌కనక్ట్‌ రాజా!

డిస్కో రాజా చిత్రానికి సీక్వెల్‌ కూడా తీస్తామంటూ దర్శకుడు ఆనంద్‌తో పాటు రవితేజ కూడా చెప్పుకొచ్చారు. కానీ రవితేజకి రియాలిటీ చాలా త్వరగా తెలిసిపోయింది. ఆల్రెడీ ఫ్లాపులకి అలవాటు పడిపోయి వున్నాడేమో ఒక్కసారి టాక్‌ బయటకు వచ్చిన తర్వాత దానిని ప్రమోట్‌ చేయాలనే వృధా ప్రయాసలు పెట్టుకోకుండా 'క్రాక్‌' సినిమాపైకి తన దృష్టి మళ్లించాడు.

సక్సెస్‌ మీట్‌లో కూడా రవితేజ మాట్లాడకపోవడంతోనే అతనెంతగా డిస్కో రాజాతో డిస్‌కనక్ట్‌ అయిపోయాడనేది అర్థమయింది. ఈ చిత్రానికి ప్రమోషనల్‌ టూర్‌ చేస్తే పికప్‌ అవుతుందంటూ రవితేజని అప్రోచ్‌ అయితే లైట్‌ తీసుకోమని చెప్పేసాడట. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్‌కి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో చాలా పేరొచ్చింది. వెరైటీ ఆలోచనలున్న దర్శకుడిగా అతడికి పలు అవకాశాలు వచ్చాయి.

అయితే వెరైటీ సినిమా తీయాలనే తపన తప్ప ఎలా తీస్తే ప్రేక్షకులకి నచ్చుతుందనేది ఆనంద్‌ అంచనా వేయలేకపోతున్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు ఫ్లాప్‌ అవడంతో ఇప్పుడిక విఐ ఆనంద్‌తో పని చేయడానికి ఎవరూ ఉత్సాహం చూపించకపోవచ్చు. ఇప్పుడు ఎక్కువ తీరిక దొరుకుతుంది కనుక కథపై కాస్త ఎక్కువ సమయం వెచ్చిస్తే ప్రయోజనం వుండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English