దానయ్యకి హ్యాండిచ్చిన మారుతి?

దానయ్యకి హ్యాండిచ్చిన మారుతి?

ప్రతిరోజూ పండగే విడుదల కాకముందే దానయ్య తనయుడిని మారుతి దర్శకత్వంలో లాంఛ్‌ చేస్తున్నట్టు, అందుకు గాను మారుతికి ఆరు కోట్ల పారితోషికం కూడా ఇస్తున్నట్టు మీడియాలో రాయించుకున్నాడు. ప్రతిరోజూ పండగే పెద్ద హిట్‌ అవడంతో ఇప్పుడు కొత్త కుర్రాడితో సినిమా దేనికని మారుతి భావిస్తున్నాడు. అదీ కాక తన పారితోషికం ఆరు కోట్ల కంటే ఎక్కువే పలుకుతుందని అనుకుంటున్నాడు.

అందుకే దానయ్య బ్యానర్లోనే ఎవరైనా ప్రముఖ హీరోతో చేద్దామని మారుతి చెప్పాడట. ఒకవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తీస్తూ తనయుడిని లాంఛ్‌ చేయడానికి ఇదే తగిన తరుణమని భావిస్తోన్న దానయ్య అందుకు అంగీకరిస్తాడనేది అనుమానమే. మారుతి సక్సెస్‌ రేట్‌ బాగున్నా కానీ ఇప్పటికిప్పుడు తనకి డేట్స్‌ ఇచ్చే హీరోలయితే లేరు.

నితిన్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ తదితరులంతా అతనితో చేయడానికి సిద్ధంగానే వున్నారు కానీ వాళ్లంతా వేరే సినిమాలతో బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో మారుతికి మార్కెట్‌ రేట్‌ కంటే రెండు కోట్లు ఎక్కువ చెల్లిస్తే దానయ్య తనయుడిని లాంఛ్‌ చేయడానికి ఓకే అంటాడేమో. దర్శకుడిగా నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లాలని చూస్తోన్న మారుతిని మిడ్‌ రేంజ్‌ సినిమాలకే పరిమితం చేసేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English