రవితేజని మళ్లీ అతడే గట్టెక్కించాలి

రవితేజని మళ్లీ అతడే గట్టెక్కించాలి

రవితేజతో వరుసగా రెండు హిట్లు ఇచ్చిన గోపిచంద్‌ మలినేని క్రాక్‌తో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నాడు. కానీ పడిపోతున్న రవితేజ మార్కెట్‌ చూసి ఇప్పుడు క్రాక్‌పై అంచనాలు పెట్టుకోవడానికి అభిమానులు కూడా జంకుతున్నారు. డిస్కో రాజా కూడా డిజాస్టర్‌ దిశగా సాగుతోన్న నేపథ్యంలో రవితేజతో రెండు హిట్లు తీసిన గోపీచంద్‌ మలినేని మళ్లీ ఆ ఫీట్‌ రిపీట్‌ చేయగలడని ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు.

గోపిచంద్‌ మలినేని గత చిత్రం విన్నర్‌ ఫ్లాప్‌ అవడంతో చాలా కాలంగా కథ రెడీ చేసే పనిలోనే వుండిపోయాడు. ఫైనల్‌గా ఒక కథ సిద్ధం చేసుకుని రవితేజ సమ్మతం పొంది సినిమా స్టార్ట్‌ చేసేసాడు. డాన్‌ శీను, బలుపు చిత్రాలతో రవితేజని ఎలా చూపిస్తే జనాలకి నచ్చుతుందనేది గోపీచంద్‌ బాగా కనిపెట్టాడు. రెగ్యులర్‌ కథలే అయినా కానీ రవితేజ ఎనర్జీని ఆ చిత్రాల్లో బాగా వాడుకున్నాడు.

వరుసగా నాలుగు డిజాస్టర్లతో డీలా పడిపోయిన డిస్కో రాజాకి 'మాస్‌ మహారాజా' అంటూ నామకరణం చేసిన ఈ దర్శకుడే క్రాక్‌తో బ్రేక్‌ ఇస్తాడనే ఆశిద్దాం. ఈ వేసవిలో ప్యాక్డ్‌గా వున్న సీజన్‌లో రాబోతున్న క్రాక్‌లో బలుపు హీరోయిన్‌ శృతిహాసన్‌ కథానాయికగా రీఎంట్రీ ఇస్తుండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English