త్రివిక్రమ్‌ తర్వాత ఆ రేంజ్‌ ఈయనకే

త్రివిక్రమ్‌ తర్వాత ఆ రేంజ్‌ ఈయనకే

ఓవర్సీస్‌ మార్కెట్‌ వరకు రాజమౌళి తర్వాత అతి పెద్ద స్టార్‌ త్రివిక్రమ్‌ అనడంలో సందేహం లేదు. నితిన్‌తో 2.5 మిలియన్‌ రాబట్టిన త్రివిక్రమ్‌ 'అల వైకుంఠపురములో'తో 3.5 మిలియన్‌ దిశగా సాగుతున్నాడు. ఓవర్సీస్‌ మార్కెట్‌లో హీరోతో సంబంధం లేకుండా కేవలం బ్రాండ్‌ నేమ్‌తో వసూళ్లు రాబట్టగల దర్శకులలో త్రివిక్రమ్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల వుంటాడు.

ఫిదాతో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిన కమ్ముల తాజా చిత్రం 'లవ్‌స్టోరీ' కూడా అక్కడ అయిదున్నర కోట్లకి అమ్ముడయింది. నాగచైతన్య చిత్రాల్లోనే ఇది అత్యధిక మొత్తం పలికిన చిత్రమంటే అందులో శేఖర్‌ పాత్ర చాలా వుంది. సాయి పల్లవి హీరోయిన్‌ కావడం కూడా ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగా ప్లస్‌ అవుతోంది. ఓవర్సీస్‌ మార్కెట్‌ బాగా పడిపోయిందని ఆ మధ్య వర్రీ అయ్యారు కానీ ఈ సంక్రాంతికే ఆరు మిలియన్లకి పైగా వసూళ్లు రావడంతో ఆ మార్కెట్‌కి ఏమీ కాలేదని తేలిపోయింది.

దీంతో ప్రామిసింగ్‌గా కనిపిస్తోన్న చిత్రాలపై బయ్యర్లు భారీగానే వెచ్చిస్తున్నారు. అయితే పెద్ద సినిమాలకి మునుపటిలా కన్ను మిన్ను కానకుండా రేట్లు ఇవ్వడానికి మాత్రం ఇప్పట్లో ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే అన్నీ అల వైకుంఠపురములో మాదిరిగా డాలర్ల వర్షం కురిపించవుగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English