పవన్‌కళ్యాణ్‌తో మజాక్‌ కాదు మరి!

పవన్‌కళ్యాణ్‌తో మజాక్‌ కాదు మరి!

పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీసే కలని నెరవేర్చుకోవడం కోసం వర్కవుట్‌ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా పింక్‌ రీమేక్‌ని తెలుగులో తీస్తున్నాడు దిల్‌ రాజు. అలాంటి పాత్రకి ఎంటర్‌టైనర్‌గా పేరున్న పవన్‌కళ్యాణ్‌ ఏమిటనేది చాలామందికి వున్న డౌటు. కానీ దిల్‌ రాజు మాత్రం తక్కువ బడ్జెట్‌లో తీసేయవచ్చునని ఏవో తనకి తెలిసిన లెక్కలు వేసుకుని ఈ చిత్రాన్ని మొదలు పెట్టేసాడు.

పవన్‌కళ్యాణ్‌ని షూటింగ్‌కి రప్పించడమంటే మాటలు కాదు. త్రివిక్రమ్‌ లాంటి స్నేహితుడికే చుక్కలు చూపిస్తుంటాడు. అలాంటిది ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేసేసి మేలో విడుదల చేయాలని చూస్తోన్న దిల్‌ రాజుకి పవర్‌స్టార్‌ పోర్షన్‌ ముందు తీసేయాలని వుంది. అందుకే దగ్గరుండి షూటింగ్‌కి తీసుకెళ్లడంతో పాటు షూటింగ్‌ జరుగుతున్నంత సేపు సెట్లోనే వుంటున్నాడు.

ఏపీలో రాజకీయాలు వేడెక్కితే పవన్‌ అటు వెళ్లిపోతాడు కనుక అతడి పోర్షన్‌ని ముందుగా తీసేయాలని దిల్‌ రాజు తన చాణక్యమంతా చూపిస్తున్నాడు. ఇటీవలి కాలంలో తన సినిమాల సెట్స్‌కి బాగా దూరంగా వుంటోన్న దిల్‌ రాజు ఈ చిత్రానికి మాత్రం పవన్‌ స్పాట్‌లో వుండగా అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. పవన్‌కళ్యాణా మజాకానా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English