మెగా ఫ్యాన్స్.. ఏమిటీ కుంపట్లు?

మెగా ఫ్యాన్స్.. ఏమిటీ కుంపట్లు?

మెగా అభిమానుల మధ్య కుంపట్లు రోజు రోజుకూ రాజుకుంటున్నాయి. ఇంతకుముందు మెగా ఫ్యామిలీలో ఏ హీరో అభిమానిని అయినా.. మెగా అభిమాని అనే అనేవాళ్లు. కానీ ఇప్పుడు చిరు అభిమానులు, పవన్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అంటూ వర్గాలు అయిపోయాయి. రాజకీయాల్లో చిరు, పవన్ వేర్వేరు దారుల్లో వెళ్లినప్పటి నుంచి ఈ విభజన మొదలైంది.

ఇప్పుడు అల్లు అర్జున్ సొంత బ్రాండ్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుండటంతో అతడి వల్ల కూడా మెగా అభిమానుల్లో కుంపట్లు తప్పట్లేదు. ఇటీవల జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి నుంచి రాజధాని తరలింపుపై పోరాడుతుంటే.. అసలు రాజకీయాలతో సంబంధం లేనట్లుగా ఉంటున్న చిరు వచ్చి ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రకటన ఇవ్వడంతో మెగా అభిమానుల్లో కుంపట్లు తీవ్రమయ్యాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా చిరు, పవన్ అభిమానులు రెండుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్నారు. తాజాగా పవన్ పాత వీడియో ఒకటి బయటికి తీసి.. దాన్ని తమకు అనుకూలంగా కట్ చేసి ట్విట్టర్లో పెట్టి పవన్ మీద నిప్పులు కురిపిస్తున్నారు చిరు ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్స్. వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్ తాను ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగానని, పవన్ మాత్రం చిరు అండతో ఎదిగాడని చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే.. పవన్ దానికి బదులిస్తూ చిరు వల్ల తానెవరో పది మందికి తెలిసి ఉండొచ్చని.. కానీ తన ముఖంతోనే సినిమాల్లో నటించానని.. తన నటన తనదే అని అన్నాడు పవన్.

దానికి కొనసాగింపుగా తన అన్నయ్య పట్ల తనకు కృతజ్ఞత ఉందని కూడా పవన్ చెప్పాడు. ఐతే ముందు, వెనుక కంట్ చేసి చిరును పవన్ అవమానించేసినట్లుగా వీడియో పెట్టి పవన్ మీద రెచ్చిపోతున్నారు చిరు ఫ్యాన్స్. ఏరు దాటాక.. సామెతను గుర్తు చేస్తూ పవన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వీళ్లకు పవన్‌ను వ్యతిరేకించే వేరే పార్టీల వాళ్లు కూడా తోడవుతున్నారు. ఐతే వీళ్లలో చాలామంది వైకాపా అనుకూలురని.. చిరు అభిమానులుగా చెప్పుకుంటే మెగా అభిమానుల్లో విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని.. మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవద్దని హెచ్చరిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఏదేమైనా మెగా అభిమానుల్లో ఈ కుంపట్లు ఎంతమాత్రం మంచిది కాదన్నది మాత్రం స్పష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English