మాస్ రాజా వచ్చినా.. స్టైలిష్ స్టార్ తగ్గట్లే

మాస్ రాజా వచ్చినా.. స్టైలిష్ స్టార్ తగ్గట్లే

సంక్రాంతికి వచ్చే భారీ చిత్రాలకు మామూలుగా రెండు వారాలు రాసిచ్చేస్తారు. ఈ సీజన్లో ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు వస్తాయి కాబట్టి తర్వాతి వారం రిలీజ్‌లు ఏమీ ఉండవు. ఈసారి పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో సంక్రాంతి సినిమాలు రెండు వారాలు కచ్చితంగా రాసిచ్చేయక తప్పలేదు. ఈ అడ్వాంటేజీని ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు పూర్తిగా ఉపయోగించుకున్నాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ మూవీ ఇరగాడేస్తూ వసూళ్ల మోత మోగించింది. అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్‌ దాటి భారీగా లాభాలందుకుంది. ఈ వారం మాస్ రాజా రవితేజ చిత్రం ‘డిస్కో రాజా’ మంచి అంచనాల మధ్య రిలీజవడంతో  ‘అల..’ జోరు తగ్గక తప్పదనుకున్నారు. కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రెండ్స్ చూస్తుంటే అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు.

శని, ఆదివారాలకు అందుబాటులో ఉన్న షోలు, బుకింగ్స్ ప్రకారం చూస్తే ‘అల వైకుంఠపురములో’నే బాక్సాఫీస్ లీడర్‌గా కనిపిస్తోంది. కొత్త చిత్రమైన ‘డిస్కో రాజా’ కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అల..’కే ఎక్కువ స్క్రీన్లు, షోలు ఉన్నాయి ఈ వారాంతంలో. శుక్రవారం రిలీజ్ రోజు కాబట్టి ‘డిస్కో రాజా’ జోరు కనిపించింది కానీ.. శనివారానికి ఆ సినిమాను మించి ‘అల..’కే ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయి. ఆ సినిమా టికెట్ల కోసమే డిమాండ్ కనిపిస్తోంది.

మెయిన్ సెంటర్లలో ఈ రెండు రోజులూ ‘అల..’ హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ పరిస్థితి చూస్తే.. దాదాపు థియేట్రికల్ రన్ ఎండ్ అయిపోయేలా కనిపిస్తోంది. సోమవారం నుంచి ఈ చిత్రాన్ని చాలా థియేటర్లలో తీసేయక తప్పేలా లేదు. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా షేర్ తీసుకుని సంతృప్తి పడక తప్పేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English