అశ్వథ్థాముడు తక్కువోడు కాదు

అశ్వథ్థాముడు తక్కువోడు కాదు

నాగశౌర్య ఏ ముహూర్తాన సొంత బేనర్ పెట్టి ‘ఛలో’ సినిమా చేశాడో కానీ.. అక్కడి నుంచి అతడి దశ తిరిగిపోయింది. ఆ సినిమాకు శౌర్య కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగింది. వసూళ్లు రెట్టింపు స్థాయిలో వచ్చాయి. అతడికంటూ ఒక ఇమేజ్ వచ్చింది. ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ తర్వాత శౌర్య నుంచి వచ్చిన మూడు సినిమాలూ నిరాశపరిచాయి. కానీ అతడి ఫాలోయింగ్ ఏమీ పడిపోలేదు.

శౌర్య సొంత బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘అశ్వథ్థామ’కు కనిపిస్తున్న హైప్ ఇండస్ట్రీ జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది. రెండు రోజుల కిందటే ‘అశ్వథ్థామ’ ట్రైలర్ రిలీజ్ చేస్తే రెండు రోజులు తిరక్కముందే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే యూట్యూబ్‌లో ఇలాంటి ఊపు కనిపిస్తుంది. శౌర్య స్థాయికి ఇది పెద్ద ఫీటే. ఈ చిత్రానికి బిజినెస్ కూడా అంచనాల్ని మించే జరిగింది.

‘అశ్వథ్థామ’ థియేట్రికల్ హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడవడం విశేషం. గత ఏడాది ఇదే సమయంలో రిలీజైన ‘ఛలో’ సినిమాను రూ.,6 కోట్లకు అమ్మారు. మధ్యలో శౌర్యకు హిట్లేమీ లేకున్నా.. ‘అశ్వత్థామ’కు రూ.15 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడమంటే చిన్న విషయం కాదు. మొదట్నుంచి ఈ చిత్రానికి హైప్ తీసుకురావడంలో శౌర్య అండ్ టీమ్ సక్సెస్ అయింది.

ఒకప్పుడు ‘జాదూగాడు’ అనే మాస్ సినిమాలో శౌర్య నటిస్తే.. అతనేంటి మాస్ సినిమా ఏంటి అన్నారు. కానీ ఇప్పుడు అతడి ఇమేజ్ మారింది. ‘అశ్వథ్థామ’ రూపంలో ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేసి ముందే ప్రేక్షకుల ఆమోదం పొందాడు. టీజర్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లోూ అంచనాలు పెంచాయి. దీంతో బిజినెస్ అంచనాల్ని మించిపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి మిగతా హక్కులు కూడా ఇదే స్థాయిలో అమ్ముడైతే సినిమాకు ఓవరాల్‌గా రూ.25 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English