స‌మంత.. సినిమాలు ఇక లైట్‌?

స‌మంత.. సినిమాలు ఇక లైట్‌?

గ‌త ద‌శాబ్దంలో ద‌క్షిణాది సినిమాపై త‌న‌దైన ముద్ర వేసిన క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు హీరోల అవ‌స‌రం లేకుండా. సొంతంగా సినిమాను నిల‌బెట్టే స్థాయికి ఆమె ఎద‌గ‌డం విశేష‌మే. గ‌త ఏడాది ఓ బేబీతో ఆమె స‌త్తా ఏంటో అంద‌రికీ అర్థ‌మైంది. పెళ్లి త‌ర్వాత మ‌రిన్ని మంచి పాత్ర‌ల‌తో ఆమె త‌న విలువ‌ను పెంచుకుంది. ఆమె నుంచి త్వ‌ర‌లోనే జాను అనే సినిమా రాబోతోంది.

అయితే ఈ మ‌ధ్య స‌మంత వ్య‌వ‌హారం చూస్తే ఆమెకు సినిమాల మీద ఆస‌క్తి త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. కొత్త‌గా సినిమాలేవీ ఒప్పుకోవ‌ట్లేదు. ఇటీవ‌లే అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌-2లో న‌టించింది. అది పూర్తి చేశాక కూడా కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు.

మునుప‌టిలా స్టార్ హీరోల స‌ర‌స‌న గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి ఆమె ఒప్పుకుంటున్న‌ట్లు లేదు. ఫిలిం మేక‌ర్స్ కూడా ఆమెకు అలాంటి పాత్ర‌లు ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు లేదు. తాజాగా స‌మంత ఓ టీవీ షో చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మంచు ల‌క్ష్మి, రానా ద‌గ్గుబాటి త‌ర‌హాలోనే ఆమె టాక్ షో ఒక‌టి చేయ‌డానికి ఒప్పుకుంద‌ని.... అందుకోసం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.

ఓవైపు వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డం, మ‌రో వైపు టీవీ షోకు ఒప్పుకోవ‌డం చూస్తుంటే స‌మంత దాదాపుగా సినిమాల నుంచి ఎగ్జిట్ అయిపోయేలాగే క‌నిపిస్తోంది. ఎలాగూ త్వ‌ర‌లోనే త‌ల్లి కావాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు స‌మంత ఇంత‌కుముందే సంకేతాలు ఇచ్చిన నేప‌థ్యంలో ఇక సినీ కెరీర్‌కు ఆమె గుడ్ బై చెప్పేసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్న‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English