డిజాస్టర్ స్ట్రీక్‌కు అడ్డుకట్ట పడుతుందా?

డిజాస్టర్ స్ట్రీక్‌కు అడ్డుకట్ట పడుతుందా?

మాస్ రాజా రవితేజ తన కెరీర్లో ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూశాడు గత కొన్నేళ్లలో. ‘రాజా ది గ్రేట్’ మినహాయిస్తే గత ఐదారేళ్లలో మాస్ రాజాకు సరైన విజయమే లేదు. అతడి నుంచి గత రెండేళ్లలో వచ్చిన ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఫ్లాపులు ఎవరికైనా సహజమే కానీ.. మాస్ రాజా మరీ మూస కథలతో విసుగెత్తించేస్తున్నాడని.. అతను మారాలని అందరూ అభిప్రాయపడ్డాడు.

ఇలాంటి తరుణంలో వైవిధ్యమైన సినిమాలు తీస్తాడని పేరున్న వీఐ ఆనంద్‌తో అతను జట్టు కట్టాడు. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే ‘డిస్కో రాజా’. ఇదొక ప్రతీకార కథ అనే సంగతి టైటిల్‌ లోగో చూస్తే అర్థమైంది కానీ.. దాని ట్రీట్మెంట్ చాలా భిన్నంగా ఉంటుందని దీని టీజర్లను బట్టి తెలిసింది.

సగటు ప్రతీకార కథకే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ జోడించి ఆసక్తికరంగానే మలిచినట్లున్నాడు ‘డిస్కో రాజా’ను వీఐ ఆనంద్. రవితేజ చాలా కాలం తర్వాత కొత్తగా, ఫుల్ ఎనర్జిటిగ్గా కనిపించిన చిత్రమిదని ప్రోమోల్లో స్పష్టమైంది. రవితేజ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా దీనికి పాజిటివ్ బజ్ వచ్చింది. కాకపోతే సంక్రాంతి సినిమాలతో ప్రేక్షకుల కడుపు నిండిపోయిన సమయంలో ‘డిస్కో రాజా’ రావడం దీనికి ప్రతికూలత. ఈ ప్రతికూలతను అధిగమించి ‘డిస్కో రాజా’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్నది ఆసక్తికరం.

ఇంతకుముందు రవితేజతో ‘నేల టిక్కెట్టు’ సినిమా తీసిన రామ్ తాళ్లూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తన్య హోప్ కథానాయికలుగా నటించగా.. బాబీ సింహా విలన్‌గా కనిపించనున్నాడు. బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టిన ఈ చిత్రం వాళ్లతో పాటు ఎదురు దెబ్బలు తిని ఉన్న రవితేజ, రామ్‌లకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English