పవన్‌ కళ్యాణ్‌ బాధితులు బతికిపోయారు

పవన్‌ కళ్యాణ్‌ బాధితులు బతికిపోయారు

పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా 'అజ్ఞాతవాసి'లాంటి కళాఖండం అవుతుందని ఎవరు ఊహిస్తారు. అందుకే అప్పట్లో ఆ సినిమాని భారీ రేట్లకి కొనేసి చాలా మంది బయ్యర్లు, థర్ట్‌ పార్టీల వాళ్లు మునిగిపోయారు. అప్పట్లో నిర్మాత రాధాకృష్ణ, పవన్‌, త్రివిక్రమ్‌ కలిసి మెయిన్‌ బయ్యర్లకి ఇరవై కోట్లు తిరిగి ఇచ్చారు. అయినా కానీ ఆ నష్టాలయితే పూర్తిగా గట్టెక్కలేదు.

కానీ అదే సంస్థని నమ్ముకుని వున్న బయ్యర్లు ఎట్టకేలకు జాక్‌పాట్‌ కొట్టారు. అల వైకుంఠపురములో చిత్రానికి ఇద్దరు నిర్మాతలున్నా కానీ బిజినెస్‌ అంతా హారిక హాసిని క్రియేషన్స్‌ మీదే జరిగింది.

ఒకట్రెండు ఏరియాలని అల్లు అరవింద్‌, రాధాకృష్ణ అట్టి పెట్టుకుని మిగతావి ఎక్కువగా అజ్ఞాతవాసి బయ్యర్లకే ఇచ్చారు. రెండు సంక్రాంతుల క్రితం మునిగిపోయిన బయ్యర్లు ఇప్పుడు 'అల వైకుంఠపురములో' వల్ల గట్టెక్కారు. ఆ సినిమాతో సంబంధం లేకుండా కొత్తగా ఈ చిత్రాన్ని తీసుకున్న బయ్యర్లయితే మరింత ఆనందంగా వున్నారు.

మొత్తానికి త్రివిక్రమ్‌ చేసిన గాయానికి తానే మందు వేసినట్టయింది. త్రివిక్రమ్‌తోనే వరుసగా ఆరు సినిమాలు తీసిన హారిక హాసిని సంస్థ అతను తారక్‌తో తీయబోతున్న తదుపరి చిత్రాన్ని కూడా నిర్మించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English