పని చేసిన హీరోలందరికీ కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్

పని చేసిన హీరోలందరికీ కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్

అనిల్ రావిపూడి.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ షాట్ డైరెక్టర్. చేసింది ఐదు సినిమాలే కానీ.. ఆ ఐదు సినిమాలతోనే పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ముఖ్యంగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ తీసిన 'సరిలేరు నీకెవ్వరు' అతణ్ని టాప్ లీగ్ డైరెక్టర్ల జాబితాలోకి చేర్చింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. సంక్రాంతి అడ్వాంటేజీని ఉపయోగించుకుని వసూళ్ల మోగించింది. మహేష్ అభిమానులకు కనువిందుగా అనిపించిన ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును దాటడం ద్వారా 'మహర్షి'ని అధిగమించి మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

దీనికి మించి మంచి టాక్ తెచ్చుకున్న మహేష్ సినిమాలు కూడా సాధించని వసూళ్లను ఇది అందుకోవడం విశేషమే. ఐతే మహేష్ బాబుకే కాదు.. ఇంతకుముందు పని చేసిన నలుగురు హీరోలకూ కూడా అనిల్ కెరీర్ బెస్ట్ హిట్లు ఇవ్వడం విశేషం.

కెరీర్ బెస్ట్ సంగతలా ఉంచితే.. ఒక హిట్టు కొడితే చాలు అనుకునే స్థితిలో ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో తొలిసారి జోడీ కట్టిన అనిల్.. 'పటాస్' రూపంలో అతడికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. అప్పట్లోనే అది రూ.25 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత అతను మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్‌‌తో 'సుప్రీమ్' తీశాడు. అది కూడా రూ.25 కోట్ల షేర్ మార్కును దాటి తేజుకు కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. దీని తర్వాత అనిల్ తీసిన 'రాజా ది గ్రేట్' రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం రూ.30 కోట్లకు పైగానే షేర్ కలెక్ట్ చేసింది.

ఇక గత ఏడాది వచ్చిన 'ఎఫ్-2' సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా రూ.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపింది. అది వెంకీ, వరుణ్‌లకు కెరీర్ బెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మహేష్ బాబుకూ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి తన ట్రాక్ రికార్డును కొనసాగించాడు అనిల్ రావిపూడి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English