వెంకీపై ట్రోలింగా.. అరవోళ్లకు మనోళ్ల స్ట్రాంగ్ రిటార్ట్

వెంకీపై ట్రోలింగా.. అరవోళ్లకు మనోళ్ల స్ట్రాంగ్ రిటార్ట్

టాలీవుడ్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకడు. చాలా హుందాగా ప్రవర్తించే ఆయనకు మిగతా హీరోలకున్నట్లు యాంటీ ఫ్యాన్స్ ఉండరు. ఎవ్వరితోనైనా బేషజం లేకుండా కలిసిపోయే మనస్తత్వం ఉన్న వెంకీ.. ఎప్పుడూ వివాదాల జోలికెళ్లడు. వెంకీ సినిమాలు రిలీజైన సందర్భంగా అసలు ఫ్యాన్ వార్స్ అన్నవే ఉండవు. ఆయన అభిమానులు కూడా హుందాగానే ఉంటారు.

అలాంటి హీరో మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆయన్ని అవమానించే ప్రయత్నం జరుగుతోంది. ఐతే ఈ పని చేస్తోంది మన తెలుగు అభిమానులు కాదు. తమిళ హీరో ధనుష్ ఫ్యాన్స్. దీనిక్కారణం ధనుష్ సినిమా ‘అసురన్’ రీమేక్‌లో వెంకీ నటిస్తుండటమే. ‘నారప్ప’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నిన్న రాత్రే రిలీజ్ చేశారు. ధనుష్‌ను తక్కువ చేయడం కాదు కానీ.. అతడి కంటే గొప్పగా ఉంది వెంకీ లుక్ ఫస్ట్ పోస్టర్లో.

ధనుష్ వయసు 35 ఏళ్లు. అతను పెళ్లీడుకొచ్చిన కొడుక్కి తండ్రిగా పెద్ద వయస్కుడి పాత్రలో కనిపించడానికి కష్టపడాల్సి వచ్చింది. కానీ మన వెంకీకి అది వయసుకు తగ్గ పాత్ర. దీంతో ఆ పాత్రలో మరింత బాగా ఫిట్ అయ్యాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అంత బాగా చేశారు దీని ఫొటో షూట్. డిజైన్ కూడా బాగా కుదిరి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐతే ఇది తమిళ జనాలకు నచ్చలేదు. ఎక్స్‌పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ అంటూ ధనుష్‌కు, వెంకీకి పోలిక పెట్టి వెంకీ తేలిపోయినట్లుగా పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు.. ‘రియల్ అసురన్ ధనుష్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి వెంకీని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే తమిళం నుంచి తెలుగులో.. తెలుగు నుంచి తమిళంలో సినిమాలు రీమేక్ కావడం కొత్త కాదు. కొన్నిసార్లు ఒరిజినల్‌లో చేసిన హీరోలతో పోలిస్తే రీమేక్ హీరోలు తేలిపోతుంటారు. మరికొన్నిసార్లు ఒరిజినల్లో చేసిన హీరోల్ని మించి పోతుంటారు. అంతమాత్రాన ఎవరూ తక్కువ కాదు.. ఎక్కువా కాదు. ఇది అర్థం చేసుకోకుండా వెంకీ అంతటి వాడిని ట్రోల్ చేయడం విడ్డూరం.
 
ధనుష్ గొప్ప నటుడే కానీ.. ఇంతకుముందు ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ రీమేక్‌లో అతను నటించగా.. వెంకీ ముందు తేలిపోయాడు. ఆ సంగతి తమిళ జనాలే ఒప్పుకుంటారు కూడా. ఇప్పుడు తన కంటే చాలా చిన్న వాడైన ధనుష్ చేసిన సినిమాను ఏమాత్రం ఇగో లేకుండా రీమేక్ చేయడమే కాక.. ధనుష్‌ లాంటి లుక్కే ట్రై చేసి.. అతడి కంటే బాగా కనిపిస్తున్న వెంకీని తమిళ జనాలు ట్రోల్ చేస్తుండటంతో మన హీరోల అభిమానులందరూ ఒక్కటయ్యారు. మన సినిమాల రీమేక్‌లను చెడగొట్టిన తమిళ హీరోల లిస్టంతా తీసి వాళ్ల గాలి తీస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English