అసురన్ రీమేక్.. భలే టైటిల్

అసురన్ రీమేక్.. భలే టైటిల్

తెలుగులో అత్యధికంగా రీమేక్ సినిమాల్లో నటించిన స్టార్ హీరో బహుశా విక్టరీ వెంకటేషే అయ్యుండొచ్చు. ఆయన కెరీర్లో రీమేక్‌ల ద్వారా అందుకున్న విజయాలు చాలానే ఉన్నాయి. చివరగా 'ఇరుదు సుట్రు' రీమేక్ 'గురు'తో ఆయన మంచి విజయమే అందుకున్నారు. దాని తర్వాత డైరెక్ట్ సినిమాలు 'ఎఫ్-2', 'వెంకీ మామ'లతోనూ సక్సెస్ సాధించి హ్యాట్రిక్ కొట్టిన వెంకీ.. ఇప్పుడు మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన  'అసురన్'ను వెంకీ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయొలెంట్ మూవీని ఫ్యామిలీ సినిమాలకు పేరుబడ్డ శ్రీకాంత్ అడ్డాల రీమేక్ చేస్తుండటం అది పెద్ద విశేషం. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ వేగంగా సాగుతోంది.

వేసవి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి 'నారప్ప' ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. రాయలసీమ పల్లెల్లో నారప్ప పేరుతో పెద్ద వాళ్లు చాలామంది ఉంటారు. సౌండింగ్ బాగుంది. క్యాచీగా ఉంది. సినిమాకు కూడా బాగానే సెట్ అయ్యే ఛాన్సుంది. జనాల్లోకి ఈజీగా వెళ్లే అవకాశమున్న ఈ టైటిల్‌ను ఖరారు చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. మరి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు అధికారికంగా ఇదే టైటిల్ ప్రకటిస్తారేమో చూడాలి.

సినిమాలో అయితే వెంకీ పాత్ర పేరు నారప్పే అనేది చిత్ర వర్గాల సమాచారం. రీమేక్ సినిమా కావడంతో షూటింగ్ శరవేగంగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. వెంకీ సరసన ఈ చిత్రంలో ప్రియమణి నటిస్తోంది. ఆమె చాన్నాళ్ల తర్వాత తెలుగులో ఓ పెద్ద సినిమా చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English