పవన్‌కళ్యాణ్‌ గంట కాల్షీట్‌!

పవన్‌కళ్యాణ్‌ గంట కాల్షీట్‌!

గంటలో గుడికి వెళ్లి రావడం కూడా కష్టమయిన పనే అయిన ఈ రోజుల్లో 'పింక్‌' రీమేక్‌ షూటింగ్‌కి పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఫస్ట్‌ డే కాల్షీట్‌ వ్యవధి అచ్చంగా ఒక్క గంటేనట! ఒక్క గంటలో ఎంత షూటింగ్‌ చేసారో, అసలు ఎన్ని షాట్లు ఓకే చేసారో తీసిన వారికే తెలియాలి. ఈ చిత్రంలో తనకి ఎక్కువ పని వుండదు కనుకే పవన్‌ ఇది చేయడానికి అంగీకరించాడు. అయితే ఏకబిగిన షూటింగ్‌ చేసి పూర్తి చేయడం కాకుండా రోజుకి గంట, రెండు గంటల కాల్షీట్లు ఇస్తానని చెప్పాడు.

ఇది దిల్‌ రాజు పద్ధతికి శుద్ధ విరుద్ధమయినా కానీ పవన్‌తో సినిమా చేయాలనే కోరిక తీర్చుకోవడం కోసమే ఆ కండిషన్లు అన్నిటికీ అంగీకరించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలాఖరుకి పూర్తి చేయాలనేది దిల్‌ రాజు ప్లాన్‌ అయినా కానీ పవన్‌ ఇలా రోజుకో గంట పని చేస్తానంటే మరి షూటింగ్‌ ఎప్పటికి పూర్తయ్యేనో ఎవరికి తెలుసు?

పవన్‌ పెట్టిన ఈ గంట, రెండు గంట కండిషన్‌కి క్రిష్‌, ఏ.ఎమ్‌. రత్నం కూడా అంగీకరించారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి పవన్‌ రెండు పడవల ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఇది అతడిని ఏ తీరానికి చేరుస్తుందనేది పింక్‌ రీమేక్‌ రిలీజ్‌ అయితే కానీ ఒక ఐడియా రాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English