దేవరకొండకి అది సరిపోదు!

దేవరకొండకి అది సరిపోదు!

విజయ్‌ దేవరకొండతో చేసే సినిమాకి 'ఫైటర్‌' అనే సాధారణ టైటిల్‌కి మించి పూరి జగన్నాథ్‌ ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు. ఇంతకాలం మీడియాలో కూడా ఫైటర్‌గానే పిలవబడుతోన్న ఈ చిత్రానికి ఆ టైటిల్‌ వద్దని కరణ్‌ జోహార్‌ చెప్పాడు. పాన్‌ ఇండియా సినిమా కనుక అన్ని భాషలకి సూట్‌ అయ్యేలా ఫైటర్‌ అయితే బాగుంటుందని జగన్‌ భావించాడు కానీ కరణ్‌ జోహార్‌ మాత్రం ఏదైనా కొత్త సౌండింగ్‌ వున్న టైటిల్‌ కావాలని అడిగాడట.

హిందీ వెర్షన్‌ని రిలీజ్‌ చేస్తోన్న కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్లలో సేల్‌ చేసే పూచీ తనదని విజయ్‌కి మాట ఇచ్చాడట. బాహుబలి, సాహో, కబాలి లాంటి వెరైటీ పేరు ఏదైనా పాన్‌ ఇండియాకి అప్పీల్‌ అయ్యేలా చూడమని చెప్పడంతో పూరి జగన్నాథ్‌ 'ఫైటర్‌' టైటిల్‌ డ్రాప్‌ అయ్యాడు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా ముంబయి, గోవాలోనే జరుగుతుంది కనుక కరణ్‌ జోహార్‌ టీమ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తుందట.

ఈ చిత్రంతో కనుక తనకి కరణ్‌తో రిలేషన్స్‌ స్ట్రాంగ్‌ అయితే ఇక మీదట చేసే చిత్రాలన్నీ పాన్‌ ఇండియా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని తీయవచ్చునని పూరి జగన్నాథ్‌ భావిస్తున్నాడు. ఎలాగో తెలుగు బడా హీరోలు కూడా పాన్‌ ఇండియా మార్కెట్‌ పట్ల ఆసక్తిగా వున్నారు కనుక ఈ చిత్రంతో పూరి హిట్‌ కొడితే స్టార్‌ హీరోల నుంచి కబురు రావడం చాలా ఈజీ అయిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English