రవితేజ బ్యాడ్‌ టైమింగ్‌?

రవితేజ బ్యాడ్‌ టైమింగ్‌?

సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలకి దూరంగా రిపబ్లిక్‌ డే వీకెండ్‌కి నోటెడ్‌ సినిమాలు రావడమనేది చాలా కాలంగా జరుగుతోంది కానీ ఈసారి రిపబ్లిక్‌ డే హాలిడే ఆదివారం అవడంతో అదేమంత అడ్వాంటేజ్‌ కాదు. ఇకపోతే సంక్రాంతికి వచ్చిన సినిమాలపై సినీ ప్రియులు, పండగ ప్రేక్షకులు భారీ స్థాయిలో డబ్బులు కుమ్మరించేసారు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలపై ప్రేక్షకులు వెచ్చించిన మొత్తానికి తోడు దర్బార్‌, ఎంత మంచివాడవురా చిత్రాలకి వసూలయిన కలక్షన్లు కూడా వున్నాయి.

దీంతో మళ్లీ సినిమా సందడి బాక్సాఫీస్‌ వద్ద అంతగా కనిపించదని ట్రేడ్‌ అభిప్రాయపడుతోంది. సంక్రాంతి సినిమాలు ఫెయిలయితే జనవరి నెలాఖరులో వచ్చే సినిమాలు బెనిఫిట్‌ అవుతుంటాయని, కానీ ఈసారి సంక్రాంతి సినిమాలు అంతగా ఆడేయడం వల్ల 'డిస్కోరాజా' చిత్రం చాలా బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే తప్ప జనాన్ని రాబట్టలేదని ట్రేడ్‌లో వినిపిస్తోంది. రవితేజ ఇటీవలి చిత్రాలు తీవ్రంగా నిరాశ పరచడం వల్ల డిస్కోరాజా ఏమాత్రం ఓపెనింగ్‌ రాబడుతుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్‌ విభిన్న ఆలోచనలున్న వాడిగా పేరు తెచ్చుకున్నా కానీ అతని గత చిత్రం ఒక్క క్షణం బాక్సాఫీస్‌ దగ్గర నిరాశపరచింది. రవితేజ మాస్‌ ఇమేజ్‌కి అనుగుణంగా తన వెరైటీ ఆలోచనలతో ఆనంద్‌ 'డిస్కో రాజా'ని తెరకెక్కించడంతో ఈ చిత్రంపై అంచనాలయితే బాగానే వున్నాయి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English