నాగబాబుకు అంత ఆత్మన్యూనతా భావమేల?

నాగబాబుకు అంత ఆత్మన్యూనతా భావమేల?

కొన్నేళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ మూవీతో రీఎంట్రీ ఇచ్చినపుడు.. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు నాగబాబు. దానికి కౌంటర్‌గా తర్వాత ట్విట్టర్లో వర్మ రెచ్చిపోయాడు. నాగబాబు సొంతంగా సాధించిందేమీ లేదని.. అన్న, తమ్ముడి మీదే ఆధారపడ్డాడని.. చిరుతో పోలిస్తే ఆయన 1 పర్సంట్ అంటూ ఎద్దేవా చేశాడు. దీనికి బదులుగా నాగబాబు స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవును.. అన్నయ్య లేకుండా తాను లేనని.. ఆయనతో పోలిస్తే 1 పర్సంట్ కాదని.. జీరో అని అన్నాడు.

ఆ సందర్భంలోనే కాదు.. మరికొన్నిసార్లు కూడా తనను తాను తక్కువ చేసుకునే మాట్లాడుకుంటాడు నాగబాబు. ‘ఆరెంజ్’ డిజాస్టర్ అయ్యాక తన ఆర్థిక పరిస్థితి దిగజారడం, తదనంతర పరిణామాలతో ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన మరోసారి తన ఆత్మన్యూనతా భావాన్ని బయటపెట్టుకున్నాడు. ఆదివారం నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చాలా ఉద్వేగంతో కొడుక్కి శుభాకాంక్షలు చెబుతూ.. ట్వీట్లు గుప్పించారు.

వరుణ్ పుట్టినప్పటి అనుభవాలు.. ఇప్పుడు అతను ప్రయోజకుడయ్యాక తాను పొందుతున్న అనుభూతుల్ని వివరిస్తూ చివర్లో ‘ఎవరికీ పెద్దగా ఉపయోగపడని నాగబాబు’ అంటూ ట్వీట్లకు ముగింపు పలకడం గమనార్హం. కొడుక్కి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన ఇలాంటి ముగింపునివ్వడం మెగా అభిమానులతో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ మాట పట్టుకుని ఆయన్ని చాలామంది కామెంట్లలో ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ.. కామెడీ షోల్లో పాల్గొంటూ.. ఇంకోవైపు రాజకీయాల్లో తమ్ముడికి అండగా నిలుస్తూ.. ‘ఎవరికీ పెద్దగా ఉపయోగపడని నాగబాబు’ అంటూ నాగబాబు తన ఆత్మన్యూనతా భావాన్ని చాటుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English