బన్నీకి త్రివిక్రమ్ యోగ్యతా పత్రం

బన్నీకి త్రివిక్రమ్ యోగ్యతా పత్రం

టాలీవుడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ రేంజే వేరు. ఆయనకున్న విషయ, భాషా పరిజ్ఞానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్‌తో పని చేయడాన్ని గౌరవంగా భావిస్తారు మన హీరోలు. ఇక ఆయన్నుంచి ప్రశంసలు అందుకుంటే దాన్నో యోగ్యతా పత్రంలా భావిస్తారు. ఐతే త్రివిక్రమ్ ఎవరినీ ఊరికే పొగిడేయడు. అతిగానూ కొనియాడడు. అలాంటి వ్యక్తి ఆదివారం రాత్రి ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ మీట్ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను ఓ రేంజిలో పొగిడేయడం విశేషం. బన్నీ తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాడని.. ప్రపంచానికి మన సినిమా అంటే ఏంటో చాటి చెబుతాడని త్రివిక్రమ్ పొగిడేయడం విశేషం.

‘అల వైకుంఠపురములో’లో బన్నీ తన పాత్రను గొప్ప పరిణతితో పోషించాడని.. అది చూసి షూటింగ్ టైంలోనే తామంతో ఎంతో ఆశ్చర్యపోయి, గొప్ప అనుభూతికి లోనయ్యామని.. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి లోనవుతుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని త్రివిక్రమ్ అన్నాడు. సినిమాలో ఎక్కడా బన్నీ కనిపించలేదని.. బంటూ పాత్రను ముందు పెట్టి అతను వెనుకే నిలబడ్డాడని.. ఈ విషయంలో అతను చూపించిన బ్యాలెన్స్ గొప్పదని.. ఆ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా అభాసుపాలయ్యే ప్రమాదం ఉండేదని.. కానీ బన్నీ అలా జరగకుండా గొప్పగా బంటూ పాత్రను పోషించాడని త్రివిక్రమ్ అన్నాడు.

బంటూ పాత్రను ఇంత బాగా చేసిన బన్నీ తనకు తెలిసి తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాడని త్రివిక్రమ్ కితాబిచ్చాడు. బన్నీ కంటే తాను పెద్దవాణ్ని కాబట్టి ఆశీర్వదించడం తప్ప ఏం చేయలేనని.. ఆ స్థాయిని బన్నీ ఎప్పుడో దాటిపోయాడని.. మన నేల నుంచి గొప్ప కథల్ని అతడి ద్వారా ప్రపంచ స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ చెప్పాడు. త్రివిక్రమ్ ఇలా పొగుడుతున్నపుడు ఇటు బన్నీ, అటు అల్లు అరవింద్ ఎలాంటి ఆనందానికి లోనయ్యారో చెప్పేదేముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English