డిస్కో రాజా.. ట్రైలర్ ఎక్కడ?

డిస్కో రాజా.. ట్రైలర్ ఎక్కడ?

ఒక సినిమాకు ఎన్ని రకాల ప్రచారాలు నిర్వహించినా.. ట్రైలర్ తెచ్చే ప్రచారం వేరు. అది చూసే ప్రేక్షకులు సినిమాకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. చాలాసార్లు ట్రైలర్లే సినిమా ఓపెనింగ్స్‌ను నిర్దేశిస్తాయి. ట్రైలర్ సరిగ్గా కట్ చేయడం.. సరైన సమయంలో దాన్ని రిలీజ్ చేయడం చాలా ముఖ్యం. టాలీవుడ్ నెక్స్ట్ రిలీజ్ ‘డిస్కో రాజా’ టీం మాత్రం ట్రైలర్ విషయంలో ఎటూ తేల్చకుండా మాస్ రాజా రవితేజ అభిమానుల్ని అయోమయంలోకి నెట్టేసింది. ఆదివారం రాత్రి ‘డిస్కో రాజా’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేయలేదు. మూవీ మేకింగ్ వీడియో మాత్రమే చూపించారు. ట్రైలర్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు కూడా. విడుదలకు ఇంకో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా.. ఇంకా ట్రైలర్ లాంచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

‘డిస్కో రాజా’ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు వచ్చాయి. ఆ రెండూ ఆకట్టుకున్నాయి. మిగతా ప్రోమోలు, పాటలు కూడా ఓకే. కానీ ఎన్ని ఉన్నా ట్రైలర్ వేసే ఇంపాక్ట్ వేరు. ఓవైపు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలైపోగా.. ఇంకా ట్రైలర్ విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రి రిలీజ్ ఈవెంట్ సమయానికి ట్రైలర్ కట్ చేయలేకపోయారా.. లేక ట్రైలర్ వదిలే ఉద్దేశమే లేదా అన్నది అర్థం కావడం లేదు. ట్విట్టర్లో మాత్రం జనాలు ‘డిస్కో రాజా’ ట్రైలర్ ఎక్కడా ఎక్కడా అంటూ హోరెత్తించేస్తున్నారు.

సోమ, మంగళవారాల్లో ట్రైలర్ రిలీజ్ కాకుంటే మాత్రం అది ఓపెనింగ్స్‌ను కొంచెం ప్రభావం చూపించడం ఖాయం. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైఫై థ్రిల్లర్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మాస్ రాజా సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తన్య హోప్ నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English