'ఆర్ఆర్ఆర్'లో నేను లేను

'ఆర్ఆర్ఆర్'లో నేను లేను

రాజమౌళి సినిమా అంటే ప్రతి చిన్న విశేషమూ పెద్ద వార్తే. #RRR హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఏ చిన్న కబురు బయటికి వచ్చినా.. అది చర్చనీయాంశం అయిపోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది.

ఇంతకుముందు రాజమౌళి తీసిన 'ఈగ'లో విలన్‌గా అదరగొట్టి.. ఆ తర్వాత 'బాహుబలి'లోనూ ఓ పాత్ర చేసిన కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర చేయబోతున్నాడని.. అతడిది ఇందులో పోలీస్ పాత్ర అని.. ఈ నెల 20 నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్‌తో అతను ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ న్యూస్ సోషల్ మీడియోలో వైరల్ అయిపోయింది. కానీ ఆ వార్త నిజం కాదని సుదీప్  క్లారిటీ ఇచ్చేశాడు.

"ఆర్ఆర్ఆర్‌లో నేను నటిస్తన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఇప్పటివరకు ఆ చిత్ర బృందం నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు" అని సుదీప్ స్పష్టం చేశాడు. దీంతో ఈ ప్రచారానికి తెరపడిపోయింది. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌, డైలాగ్ మాడ్యులేషన్‌తో సుదీప్ తన పాత్రలకు తెచ్చే విలువే వేరు.

'బాహుబలి'లో చిన్న పాత్రే చేసినా తన ప్రత్యేకతను చూపించాడు. ఈ మధ్యే 'సైరా'లో ఓ కీలక పాత్రతో అదరగొట్టాడు. అలాంటి నటుడు 'ఆర్ఆర్ఆర్'లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం జనాల్లో ఉంది. మరి ఏమీ లేకుండా అతనీ సినిమాలో నటించేస్తున్నట్లు అంతగా ప్రచారం ఎలా జరిగిందో మరి. ఇప్పటికైతే 'ఆర్ఆర్ఆర్' టీం తనను సంప్రదించలేదని సుదీప్ అంటున్నాడు. మరి తర్వాతి రోజుల్లో ఏమైనా జక్కన్న అతడిని కాంటాక్ట్ చేస్తాడేమో చూడాలి.
  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English