బన్నీ-సుకుమార్.. టైటిల్ అదేనా?

బన్నీ-సుకుమార్.. టైటిల్ అదేనా?

ఎంత వారలైనా సెంటిమెంటు దాసులే. సినిమా వాళ్లను చూస్తే ఇలాగే అనాలనిపిస్తుంది. సక్సెస్ రేట్ బాగా తక్కువుండే సినీ పరిశ్రమలో సెంటిమెంట్లను ఫాలో కావడం అనివార్యం అనిపిస్తుంది. మామూలుగా సెంటిమెంట్లను పట్టించుకోని వాళ్లు కూడా ఇక్కడ మాత్రం అనుసరిస్తారు. పెద్ద పెద్ద దర్శకులు కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవడం చూస్తుంటాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. చాలా వరకు తన సినిమాల పేర్లు ‘అ’తో మొదలయ్యేలా చూసుకుంటాడు. మరో టాప్ డైరెక్టర్ సుకుమార్ ఇంతకుముందు పెద్దగా సెంటిమెంట్లు ఫాలో అయినట్లు కనిపించలేదు కానీ.. ‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకున్నాక ఆయనకు కూడా సెంటిమెంట్లపై గురి ఏర్పడినట్లుంది.

బన్నీతో చేయబోయే తన తర్వాతి సినిమా విషయంలో ‘రంగస్థలం’ను ఆయన చాలా రకాలుగా ఫాలో అవుతున్నట్లుంది. దాని మాదిరే ఇదీ పీరియడ్ ఫిలిం. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులోనూ థ్రిల్లర్ లక్షణాలున్నాయట. అలాగే హీరో లుక్ విషయంలోనూ రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య పోలికలుంటాయంటున్నారు. ఇవన్నీ కాక టైటిల్ విషయంలోనూ ‘రంగస్థలం’ను అనుసరించనున్నాడట సుక్కు.

ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. దీని సౌండింగ్ ‘రంగస్థలం’ను గుర్తు చేస్తోంది. అది కూడా ఒక ప్రాంతాన్ని సూచించేదే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ ఇదని.. అందుకే ఆ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం దసరా కానుకగా రిలీజయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English