కామెడీ వర్కవుట్ కాలేదు.. యాక్షన్‌తో పనవుతుందా?

కామెడీ వర్కవుట్  కాలేదు.. యాక్షన్‌తో పనవుతుందా?

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవాడు. అతడి సినిమాలు మినిమం గ్యారెంటీ వినోదాన్నందించేవి. అల్లరోడి ఫ్లాప్ సినిమాలు కూడా బయ్యర్లను సేఫ్ జోన్లో ఉంచేవి. తక్కువ బడ్జెట్లో సినిమాలు తెరకెక్కేవి. కామెడీకి ఢోకా ఉండేది కాదు. ఓ మోస్తరుగా జనాలు చూసినా సినిమా సేఫ్ అయిపోయేది. కానీ అతడి కామెడీ సినిమాలు కొన్నేళ్ల తర్వాత జనాలకు మొహం మొత్తేయడం మొదలైంది. ఒకే తరహా చిత్రాలతో అతను విసుగెత్తించేశాడు.

వరుస ఫ్లాపులతో మార్కెట్‌ను బాగా దెబ్బ తీసుకున్నాడు. చివరగా అల్లరోడి నుంచి వచ్చిన ‘సిల్లీ ఫెలోస్’ వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. దీని తర్వాత అతను చేసిన ‘బంగారు బుల్లోడు’ ఎటూ కాకుండా పోయింది. ఆ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు.

ఇలాంటి సమయంలో అల్లరి నరేష్ కొత్త సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో అల్లరోడు చేయబోయే కొత్త చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో రక్తమోడుతున్న అల్లరోడు జనాలకు కొత్తగా కనిపిస్తున్నాడు. అతను ఇలాంటి ఇంటెన్స్ మూవీ చేయడం ప్రేక్షకులు ఊహించనిదే. ఊరికే పోస్టర్ వరకు ఇలా కనిపిస్తాడా.. లేక సినిమాలో కూడా ఇలాగే వయొలెంటుగా ఉంటాడా అన్నది చూడాలి.

తనకు కలిసొచ్చిన కామెడీతోనే నరేష్ సరైన ఫలితాలందుకోలేకపోతున్నాడు. అలాంటిది తనది కాని యాక్షన్ జానర్లో అతను ఏమేర సక్సెస్ అవుతాడో చూడాలి. విశేషం ఏంటంటే.. ఇంతకుముందు నరేష్‌తో ‘దొంగలబండి’ అనే సినిమా తీసిన సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. సంక్రాంతికి అతను ‘ఎంత మంచివాడవురా’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మరి అతను, కొత్త దర్శకుడు విజయ్ కలిసి అల్లరోడికి ఎలాంటి ఫలితాన్నందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English