త్రివిక్రమ్ ముందు హీరోలు కూడా దిగదుడుపే

త్రివిక్రమ్ ముందు హీరోలు కూడా దిగదుడుపే

యుఎస్‌ తెలుగు సినిమాల మార్కెట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆయన హీరోల్ని మించి హవా సాగిస్తున్నారక్కడ. ఏ హీరోకూ, ఏ దర్శకుడికీ లేని స్థాయిలో నాలుగు 2 మిలియన్ డాలర్ల సినిమాలతో త్రివిక్రమ్ అగ్ర స్థానంలో ఉండటం విశేషం. యుఎస్‌లో త్రివిక్రమ్‌ను పక్కన పెడితే.. ఒక హీరోకైనా, దర్శకుడికైనా ఉన్న అత్యధిక 2 మిలియన్ డాలర్ల మూవీస్ మూడు మాత్రమే.

ప్రభాస్ (బాహుబలి-1, బాహుబలి-2, సాహో) ఆ ఘనత సాధించాడు. మహేష్ బాబు (భరత్ అనే నేను, శ్రీమంతుడు), రాజమౌళి (బాహుబలి-1, బాహుబలి-2), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, అరవింద సమేత), చిరంజీవి (సైరా నరసింహారెడ్డి, ఖైదీ నంబర్-150) రెండేసి 2 మిలియన్+ డాలర్ల సినిమాలతో కొనసాగుతున్నారు. ఐతే త్రివిక్రమ్ ఏకంగా నాలుగు 2 మిలియన్ డాలర్ల ప్లస్ వసూళ్ల సినిమాలతో అగ్ర స్థానానికి చేరడం విశేషం.

ఇప్పటికే 'అఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత' చిత్రాలతో మూడుసార్లు 2 మిలియన్ క్లబ్బులో చేరాడు త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'అల వైకుంఠపురములో' కూడా ఈ క్లబ్బులో అడుగు పెట్టింది. 'సరిలేరు నీకెవ్వరు' కంటే ఒక రోజు లేటుగా రిలీజైన 'అల..' దాన్ని చూస్తుండగానే దాటేసి 2 మిలియన్ క్లబ్బులో చేరడం విశేషం. మహేష్ సినిమా ఈ మార్కును చేరుకోవడం సందేహంగానే ఉంది.

రెండో వీకెండ్లో కూడా జోరు చూపించేలా ఉన్న 'అల..' 2.5 మిలియన్ మార్కును కూడా ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది. ఇది యుఎస్‌లో 'అఆ'ను దాటి త్రివిక్రమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడమూ లాంఛనమే కావచ్చు. యుఎస్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో అక్కడ తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు త్రివిక్రమ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English