నందమూరి వారికి మళ్లీ చుక్కెదురు

నందమూరి వారికి మళ్లీ చుక్కెదురు

గత సంక్రాంతికి ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిరాశ పరచగా, ఈ ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్‌ హిట్‌ కొట్టేస్తాడనే అభిమానులు ఆశించారు. అంత పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని తెలిసినా కానీ అచంచలమైన నమ్మకంతో తమ సినిమాకి తప్పకుండా ఆదరణ వుంటుందంటూ 'ఎంత మంచివాడవురా'ని సరిగ్గా సంక్రాంతి రోజున విడుదల చేసారు.

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో బ్రహ్మాండంగా ఆడుతోన్న దశలో కూడా తమ సినిమా తప్పకుండా 'సంక్రాంతి విజేత'గా నిలుస్తుందనే నమ్మకంతో అస్సలు వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి రోజున విడుదలవడంతో పెద్ద సినిమాలకి వచ్చిన ఓవర్‌ ఫ్లోస్‌ని ఈ చిత్రం కైవసం చేసుకోగలిగింది. అయితే ఈ నాసిరకం కుటుంబ కథా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మొదటి రోజే తిప్పి కొట్టారు. దీంతో పండగ రోజుల్లో కూడా ఈ చిత్రం అంతగా క్యాష్‌ చేసుకోలేకపోతోంది.

సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు క్లిక్‌ అయితే ఇక మిగతా సినిమాల పరిస్థితి ఏమవుతుందనే దానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలుస్తుంది. అయితే నిజంగా సినిమాలో అంత దమ్ముంటే దాని రేంజ్‌లో అది నిలబడగలిగేది. కానీ ఈ చిత్రం స్టామినా ఎంత, ఇది ఎంత మంచి సినిమా అనేది అంచనా వేయడంలో మాత్రం నిర్మాతలు, దర్శకుడు, హీరో అందరూ బొక్క బోర్లా పడ్డట్టయింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English