‘ఒక్కడు’ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

‘ఒక్కడు’ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

మహేష్ బాబు కెరీర్లో మైల్ స్టోన్‌లా నిలిచిపోయిన చిత్రం ‘ఒక్కడు’. అతడికి స్టార్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే. అప్పట్లో టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు చాలానే ఈ చిత్రం బద్దలు కొట్టింది. దీనికంటే ముందు దర్శకుడు గుణశేఖర్ తీసిన ‘మృగరాజు’ పెద్ద డిజాస్టర్. మహేష్ కూడా ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి డిజాస్టర్లతో బాగా దెబ్బ తిని ఉన్నాడు. నిర్మాత ఎం.ఎస్.రాజు సైతం ‘దేవిపుత్రుడు’ ధాటికి కుదేలై ఉన్నాడు. కానీ ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఒక్కడు’ మాత్రం చారిత్రక విజయం సాధించింది. ఈ సినిమా కథకు ఎలా బీజం పడింది, దీనికి ముందు అనుకున్న టైటిల్ ఏంటి అనే ఆసక్తికర విషయాల్ని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

ప్రస్తుత భారత బ్యాడ్మింటన్ కోచ్, ఒకప్పటి ఆటగాడు పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ చదివినపుడు ‘ఒక్కడు’ కథకు బీజం పడినట్లు గుణశేఖర్ వెల్లడించాడు. తన తండ్రికి ఇష్టం లేకుండా తాను ఎలా బ్యాడ్మింటన్‌లో అడుగు పెట్టి అందులో ఎదిగింది గోపీచంద్ అందులో వివరించగా.. ఈ పాయింట్ మీద ‘ఒక్కడు’ కథను రాసి.. దానికి ఫ్యాక్షనిజం ఎపిసోడ్‌ను జోడించాడట గుణశేఖర్.

ఈ చిత్రానికి ముందు  ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్ పెట్టాడట గుణశేఖర్. ఐతే ఆ టైటిల్ అప్పటికే ఎవరో రిజిస్టర్ చేయించేశారట. డబ్బులిస్తామని అన్నా కూడా ఆ టైటిల్ ఇవ్వకపోవడంతో వేరే టైటిల్ పెట్టాల్సి వచ్చిందట. తర్వాత ‘కబడ్డీ’ అనే టైటిల్ పెట్టామని.. కానీ అది యూనిట్ సభ్యులకు పెద్దగా నచ్చలేదని.. తర్వాత ‘ఒక్కడు’ అని పెట్టగా అందరూ చాలా బావుందనడంతో దాన్నే ఖరారు చేశామని గుణశేఖర్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English