ఇదేం అప్ డేట్ ప్రభాసూ..

ఇదేం అప్ డేట్ ప్రభాసూ..

ఈ రోజుల్లో ఫ్యాన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం. వాళ్లను నిరంతరం ఎంగేజ్ చేస్తూ ఉండకపోతే.. సినిమా రిలీజ్ టైం చాలా ఇబ్బందైపోతుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేది.. యాంటీ ఫ్యాన్స్‌ను ఢీకొట్టేది.. నెగెటివిటీ స్ప్రెడ్ కాకుండా చూసేది వాళ్లే. సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావాలన్నా కూడా అభిమానుల పాత్ర చాలా ముఖ్యం. వాళ్ల కోసం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వడం, ఏదో ఒక విశేషం రూపంలో కానుకలు ఇవ్వడం కీలకం. అల్లు అర్జున్ లాంటి వాళ్లు ఫ్యాన్ మేనేజ్మెంట్ మీద చాలా శ్రద్ధ పెడతారు. ఈ మధ్య మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా ఈ విషయంలో అప్రమత్తం అవుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ ముంగిట ఫొటో షూట్లు కూడా అందులో భాగమే. ఐతే ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాగా వెనుకబడి ఉన్నాడు.

తన అభిమాన గణాన్ని ప్రభాస్ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇది ప్రభాస్ సింప్లిసిటీలో భాగం కావచ్చు. కానీ ఈ కాలంలో అలా ఉంటే సరిపోదు. ప్రభాసే ఇలా ఉంటే.. అతడి మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్ వాళ్లు మరీ టూమచ్. ‘సాహో’ విషయంలో ఎప్పుడూ సరైన అప్ డేట్ ఇవ్వక, అభిమానులతో సమయానుకుంటూ విశేషాలు పంచుకోక విపరీతంగా ఏడిపించారు. దీనిపై అభిమానులు ఎంతగా గొడవ చేశారో తెలిసిందే. అయినా వాళ్లలో మార్పు లేదు.

ప్రభాస్‌తో తీస్తున్న కొత్త చిత్రం విషయంలోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఏడాది కిందటే మొదలైందీ చిత్రం. ఇప్పటిదాకా దీని టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ వదల్లేదు. అసలు వీటి గురించి అప్ డేటే లేదు. ఐతే ఇప్పుడేదో అప్ డేట్ రాబోతోందంటూ రెండు మూడు రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు. చివరికి చూస్తే ప్రభాస్ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కొనసాగించబోతున్నాడంటూ అత లుక్ కూడా సరిగా కనిపించని ఒక మామూలు ఫొటో ఒకటి వదిలేసి పండగ చేసుకోమన్నారు యువి వాళ్లు. దీంతో ఫ్యాన్స్‌కు మండిపోయి ఇదీ ఒక అప్ డేటా అంటూ తిట్టిపోస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English