మ‌హేష్‌కు అదిరిపోయే ఆఫ‌రిచ్చిన తెలంగాణ మంత్రి

మ‌హేష్‌కు అదిరిపోయే ఆఫ‌రిచ్చిన తెలంగాణ మంత్రి

`స‌రిలేరు నీకెవ్వ‌రూ` స‌క్సెస్‌తో జోష్‌లో ఉన్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఊహించ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది.  దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ సరిలేరు నీకెవ్వ‌రు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. విజ‌య‌వంతంగా క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న ఈ సినిమా స‌క్సెస్ మీట్ వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించారు. దీనికి మ‌హేష్ హాజ‌ర‌య్యారు. అయితే, ఆయ‌న‌కు తెలంగాణ మంత్రి నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చింది.

వ‌రంగ‌ల్‌లోని జేఎన్ఎస్ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు విజయశాంతి, దిల్ రాజు, రశ్మిక మందన్న, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, దేవిశ్రీప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ, కాళేశ్వరం నీళ్లతో వరంగల్‌ను మరో కోన‌సీమ‌గా తీర్చిదిద్దిన‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అందుకే సినిమా వాళ్లు హైదరాబాద్ తరువాత వరంగల్ అడ్డాగా ఎంచుకోవాలని కోరారు.

మీరు వరంగల్ కి వస్తాను అంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ తో మాట్లాడి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ప‌బ్లిక్‌లోనే మంత్రి ద‌యాక‌ర్ రావు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కు ఆఫ‌ర్ ఇచ్చారు. ``మాకు దిల్ రాజు, వంశీ పైడిపెల్లి ఉన్నారు. వారి సహకారంతో సినిమా ఇండస్ట్రీని వరంగల్ కి తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వరంగల్ కేంద్రంగా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. `` అని అన్నారు. ``ఈ స‌క్సెస్ మీట్‌ ప్రోగ్రాం విష‌యం ఒక్క రోజు ముందుగా చెప్పినా జిల్లా కలెక్టర్, సీపీ చేసిన ఏర్పాట్లను మీరు చూసారు. ఇక ముందు కూడా ఇలానే ఉంటుంది. వ‌రంగ‌ల్‌లో సినిమాలు తీయండి` అని సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English