సమ్మర్ రేసులో పవన్ సినిమా

సమ్మర్ రేసులో పవన్ సినిమా

జనసేనాని మళ్లీ పవర్ స్టార్‌గా మారే రోజు అతి త్వరలోనే వస్తోంది. ఇంకో మూడు రోజుల్లోనే పవన్ ముఖానికి మేకప్ పడబోతున్నట్లు సమాచారం. ఈ నెల 20న ‘పింక్’ రీమేక్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ నేరుగా షూటింగ్‌లో పాల్గొంటారు.. లేదంటే వేరే సీన్లు తీశాక రంగంలోకి దిగుతాడా అన్నది క్లారిటీ లేదు.

ఐతే ఇప్పుడున్న గడ్డం లుక్‌తోనే సినిమా చేయాలని పవన్ ఫిక్సయిన నేపథ్యంలో ప్రిపరేషన్ కోసం పెద్దగా టైం తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. ఈ చిత్రానికి పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్లు కేటాయించినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో దాదాపు 40 శాతం సన్నివేశాల్లో పవన్ కనిపించడు కాబట్టి ఆ 20 రోజుల డేట్లు సరిపోవచ్చు.

‘పింక్’ ఒరిజినల్లో అమితాబ్ చేసిన పాత్రను తెలుగులో పవన్ చేస్తున్నాడు. ఇదే పాత్రను తమిళంలో అజిత్ చేశాడు. అతడికి జోడీగా ఒక హీరోయిన్ని కూడా పెట్టారు. తెలుగులో కూడా ఇలాగే చేయబోతున్నారు. పూజా హెగ్డేను పవన్‌కు జోడీగా నటింపజేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఒప్పుకుంటే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

హిందీలో తాప్సి, తమిళంలో శ్రద్ధ శ్రీనాథ్ చేసిన పాత్రను తెలుగులో అంజలి చేయబోతోంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రాల రూపకర్త వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నాడు. ‘పింక్’ తెలుగు రీమేక్‌ను సమ్మర్ రేసులో నిలపబోతున్నారని.. మే నెలాఖర్లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English