రజనీకి అల్లుడి పంచ్

రజనీకి అల్లుడి పంచ్

ఇప్పటిదాకా కోలీవుడ్లో ఎన్నడూ చూడని చిత్రం చోటు చేసుకోబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా థియేటర్లలో ఉండగా.. ఆయన అల్లుడు ధనుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గత ఏడాది ‘పేట’ లాగే ఈసారి కూడా రజనీ సినిమా సంక్రాంతి రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. అగ్ర దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన ‘దర్బార్’ ఈ నెల 9న థియేటర్లలోకి దిగింది.

ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా తమిళనాట మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వారం రోజుల పాటు ఈ చిత్రానికి ఎదురు లేకపోయింది. అంచనాల్ని మించి కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఐతే ఇప్పుడు ఆ సినిమాకు రజనీ అల్లుడి చిత్రం ‘పటాస్’ గండి కొడుతోంది. సంక్రాంతి కానుకగా బుధవారమే రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

సంక్రాంతి అడ్వాంటేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ‘పటాస్’ ధనుష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకుంది. టాక్ బాగుండటంతో తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. వీకెండ్లో ఈ సినిమాకు వసూళ్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతికి తమిళంలో రూరల్ ఎంటర్టైనర్స్ బాగా ఆడతాయి. గత ఏడాది ‘పేట’కు పోటీగా వచ్చిన ‘విశ్వాసం’ ఈ తరహా సినిమానే. అది రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘పటాస్’ సైతం గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమానే కావడం దీనికి కలిసొచ్చే అంశం.

ఇంతకుముందు ధనుష్‌తో ‘కొడి’ (తెలుగులో ధర్మయోగి) అనే హిట్ మూవీ తీసిన దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ధనుష్ అభిమానుల్ని బాగానే అలరిస్తున్నాడు. మన నవీన్ చంద్ర ఇందులో విలన్ పాత్ర చేయడం విశేషం. ఇప్పటిదాకా ‘దర్బార్’ జోరు సాగించినా.. ‘పటాస్’ దెబ్బకు వసూళ్లు ఆల్రెడీ తగ్గిపోయాయి. రెండో వీకెండ్లో రజనీ సినిమాకు ధనుష్ మూవీ బాగానే గండికొట్టేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English