సురేశ్ బాబుకు అమెజాన్ షాకిచ్చింది

సురేశ్ బాబుకు అమెజాన్ షాకిచ్చింది

కొత్త వేదికలు వచ్చిన ప్రతిసారీ సరికొత్త సమస్యలు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఇబ్బందినే సినీ నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ స్ట్రీమింగ్ విషయంలో అమెజాన్.. జీ.. నెట్ ఫ్లిక్స్ తో పాటు అనేకం వచ్చాయి. సినిమాల్ని ఆన్ లైన్ లో విడుదల చేయటానికి వీలుగా ఒప్పందం చేసుకొని రిలీజ్ చేసే ఈ వేదికలు.. తరచూ నిర్మాతలకు షాకులు ఇస్తున్నాయి.

ఇలాంటి షాకులకు సంబంధించి తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న అమెజాన్.. తాజాగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు సురేశ్ బాబును సైతం వదిలిపెట్టలేదని.. ఆయనకు ఊహించని రీతిలో షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. సినిమా నిర్మాణంలోనే కాదు.. మార్కెటింగ్ లోనూ మాంచి పట్టున్న సురేశ్ ప్రొడక్షన్ అధినేత సురేశ్ బాబుకు అమెజాన్ ఇచ్చిన షాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు తెర తీసింది.

డిజిటల్ మీడియాతో డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్స్ కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సురేశ్ బాబుకు.. ఇప్పుడు అలాంటి సమస్యే ఆయనకు ఎదురైంది.  ఇటీవల సురేశ్ ప్రొడక్షన్ నిర్మించి విడుదల చేసిన మూవీ వెంకీ మామ. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ కు విక్రయించారు సురేశ్ బాబు.

అయితే.. హక్కుల్ని అమ్మే సమయంలోనే.. సినిమా విడుదలైన యాభై రోజుల తర్వాత మాత్రమే ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్ పెట్టారట. ఒప్పంద సమయంలో సురేశ్ బాబు చెప్పిన కండీషన్ కు ఓకే చెప్పిన అమెజాన్.. తీరా సినిమా విడుదలైన నెల రోజులకే అమెజాన్ లో అప్ లోడ్ చేయటంపై సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తాను తరచూ ప్రస్తావించే కష్టమే తనకు ఎదురైన వేళ.. సురేశ్ బాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English