ముందొచ్చిన మహేష్ కన్నా.. వెనకొచ్చి బన్నీ వాడి

ముందొచ్చిన మహేష్ కన్నా.. వెనకొచ్చి బన్నీ వాడి

అనుకున్నదే అయింది. ఓవర్సీస్ కింగ్ మహేష్ బాబును.. అక్కడ అతడి ముందు చాలా చిన్న హీరోలా కనిపించే అల్లు అర్జున్ దాటేశాడు. ఇంతకుముందులా మహేష్ యుఎస్ బాక్సాఫీస్‌లో మహేష్ ఆధిపత్యం చలాయించలేకపోతున్న సంగతి తెలిసిందే. అతడి చివరి సినిమా ‘మహర్షి’ కనీసం 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో కూడా చేరలేకపోయింది. పెట్టుబడి-రాబడి ప్రకారం చూస్తే ఆ చిత్రం డిజాస్టర్ అని చెప్పాలి.

క్లాస్ సినిమానే అయినా ఆ సినిమా యుఎస్ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అలాంటిది ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మాస్ సినిమా ఏం ఆడుతుందో అన్న సందేహాలు కలిగాయి. ఐతే సంక్రాంతి సీజన్ సందడి కలిసొచ్చి ఈ సినిమాకు ప్రిమియర్లు బలంగానే పడ్డాయి. తర్వాత కూడా కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి..

ఐతే దీంతో పోలిస్తే ‘అల వైకుంఠపురములో’ యుఎస్‌లో అదరగొడుతోంది. ‘సరిలేరు..’తో పోలిస్తే ఈ సినిమాకు లొకేషన్లు తక్కువ, టికెట్ల రేట్లూ తక్కువ. అయినప్పటికీ దీనికి ‘సరిలేరు..’ను మించి వసూల్లు వస్తున్నాయి. మహేష్ సినిమా ఒక రోజు ముందు రోజు ముందు రిలీజైనా సరే.. ‘అల..’ దాని వసూళ్లను దాటేయడం విశేషం. ‘అల..’ యుఎస్ వసూల్లు 1.8 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది. సరిలేరు.. వసూళ్లు 1.75 మార్కు దగ్గర ఉన్నాయి. ‘అల..’ వీక్ డేస్‌లో సైతం అక్కడ అదరగొడుతోంది.

రెండో వీకెండ్లో ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్‌ను రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2 మిలియన్ మార్కును దాటడమే కాదు.. 2.5 మిలియన్ మార్కును కూడా టచ్ చేయొచ్చు. మరోవైపు ‘సరిలేరు..’ 2 మిలియన్ మార్కును టచ్ చేస్తే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. సంక్రాంతి సీజన్లో వచ్చిన తొలి సినిమా ‘దర్బార్’ అన్ని భాషల్లో కలిసి మిలియన్ మార్కును అందుకోగా.. ‘ఎంత మంచివాడవురా’కు పూర్ ఓపెనింగ్స్ వస్తున్నాయక్కడ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English