సరైనోడిని మించిపోతున్న బంటూ గాడు

సరైనోడిని మించిపోతున్న బంటూ గాడు

అప్పట్లో అల్లు అర్జున్ సినిమా 'జులాయి' రూ..40 కోట్ల షేర్ మార్కును దాటి అతడి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిస్తే ఆశ్చర్యపోయి చూశారు. అప్పటికి అతడి స్థాయికి అది గొప్పగా అనిపించింది. ఐతే ఆ విజయాన్ని ఆసరాగా చేసుకుని తర్వాతి మూణ్నాలుగేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అల్లు హీరో. రూ.75 కోట్ల షేర్ మార్కును టచ్ చేశాడు. నాలుగేళ్ల కిందట 'సరైనోడు' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు బన్నీ. ఆ తర్వాత దాన్ని మించే సినిమా ఏదీ రాలేదు అతడి నుంచి.

'దువ్వాడ జగన్నాథం' ఆరంభంలో జోరు చూపించినా.. ఆ తర్వాత నిలవలేకపోయింది. 'నా పేరు సూర్య' రికార్డులు కొల్లగొట్టడం తర్వాత.. బ్రేక్ ఈవెన్‌కు కూడా చాలా దూరంలో ఆగిపోయి బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఐతే ఈ సినిమా పరాభవం నుంచి కోలుకుని ఇప్పుడు తన కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చేస్తున్నాడు బన్నీ.

సంక్రాంతి కానుకగా రిలీజైన అల్లు అర్జున్ కొత్త చిత్రం 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సాగిపోతోంది. ఈ చిత్రం విడుదలైన ఐదో రోజుకే బన్నీ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను అందుకుంటుండటం విశేషం. తొలి రోజు నుంచి ప్యాక్డ్ హౌసెస్‌తో నడుస్తున్న ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.70 కోట్ల షేర్ మార్కుకు చేరువైంది. పండుగ సెలవుల అడ్వాంటేజీని పూర్తిగా వాడుకున్న 'అల..' రిలీజైన రోజు నుంచి ఏ రోజూ తగ్గలేదు.

బుధవారం సంక్రాంతి రోజు మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు.. 'ఎ' సెంటర్లు, 'బి' సెంటర్లు అని తేడా లేకుండా హౌస్ ఫుల్స్ పడ్డాయి ఈ చిత్రానికి. ముందు రోజు కంటే బుధవారం కలెక్షన్లు ఎక్కువ వచ్చినట్లు ట్రేడ్ పండిట్ల అంచనా. గురువారం ఈ ఈ చిత్రం రూ.75 కోట్ల షేర్ మార్కును దాటి బన్నీ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం లాంఛనమే కావచ్చు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే బన్నీ తొలి 100 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలూ ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English