‘అల వైకుంఠపురములో’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే..

‘అల వైకుంఠపురములో’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే..

సంక్రాంతి విన్నర్ ‘అల వైకుంఠపురములో’నే అనే విషయంలో మరో మాట లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’తో పోలిస్తే ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. దీంతో ఆడియన్స్ ఒక్కసారిగా ఇటు మళ్లారు. వారి ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే అవుతోంది. రెండు సినిమాలూ చూసేవాళ్లు చూస్తారు కానీ.. పండక్కి ఏదైనా ఒక్క సినిమానే చూడాలనుకునేవాళ్లు మాత్రం ‘అల..’ వైపే చూస్తున్నారు.

దీని టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన అర్లీ మార్నింగ్ షోలను వారమంతా కొనసాగించాల్సిన పరిస్థితి వస్తోంది. మామూలుగా వారం రోజులకు ఉదయం షోల కోసం అనుమతులు తీసుకుంటారు కానీ.. తొలి రోజు తర్వాత వాటికి డిమాండ్ ఉండదు. రెండో రోజు నుంచే ఆ షోలను ఆపేస్తారు. మార్నింగ్ షోలతో మొదలుపెడతారు.

కానీ ఈ సంక్రాంతి సీజన్లో ‘సరిలేరు నీకెవ్వరు’తో థియేటర్లను పంచుకోవాల్సి రావడంతో ‘అల వైకుంఠపురములో’కు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ సినిమా టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉండగా.. దాన్ని తట్టుకోవడం కోసం అర్లీ మార్నింగ్ షోలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగిస్తున్నారు. అవి హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్నాయి.

సంక్రాంతి పండగ కోసం ఆంధ్రా ప్రాంత వాసులు తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్లినా హైదరాబాద్ సిటీలో ‘అల..’కు టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజి నడుస్తున్నాయి. అర్లీ మార్నింగ్ షోల నుంచి సెకండ్ షోల వరకు వేటికీ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. మల్టీప్లెక్సులు మొదలు.. సింగిల్ స్క్రీన్ల వరకు అన్నింట్లోనూ ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఈ మోత చూస్తుంటే ‘అల..’ ఫుల్ రన్లో వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English