ఎఫ్-3.. కొత్త ప్రపంచంలో

ఎఫ్-3.. కొత్త ప్రపంచంలో

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్‌తో అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశం అందుకున్నాడంటే అందుకు ‘ఎఫ్-2’నే కారణం. ఈ సినిమా రిలీజైనపుడే దీనికి కొనసాగింపుగా ‘ఎఫ్-3’ చేస్తానని అనిల్ రావిపూడి కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు, హీరో వెంకటేష్ సైతం ‘ఎఫ్-3’ విషయంలో ఉత్సాహం చూపించారు. త్వరలోనే వీళ్ల కలయికలో ‘ఎఫ్-3’ మొదలయ్యే అవకాశముంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్లలో భాగంగా అనిల్ మరోసారి ‘ఎఫ్-3’ గురించి మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తనకున్న ఐడియాలను మీడియాతో పంచుకున్నాడు.

‘ఎఫ్-3’ సినిమా కోసం ఇప్పటికే ఒక లైన్ అనుకున్నానని.. అది ‘ఎఫ్-2’ స్టయిల్లో ఉండదని అనిల్ చెప్పాడు. ఈ సినిమా ‘ఎఫ్-2’కు సీక్వెల్ కూడా కాదని.. ఆ సినిమా కొత్త ప్రపపంచంలో నడుస్తుందని తెలిపాడు. ఎఫ్-2లోని లీడ్ క్యారెక్టర్లన్నీ ఇందులో ఉంటాయని.. హీరోలతో పాటు హీరోయిన్లనూ కొనసాగిస్తానని అనిల్ తెలిపాడు. కాబట్టి వెంకీ, వరుణ్‌లతో పాటు తమన్నా, మెహ్రీన్ సినిమాలో కొనసాగడం ఖాయం అన్నమాట.

వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్ పాత్రను కూడా సినిమాలో కొనసాగిస్తానని అనిల్ తెలిపాడు. ఆయన లేకుండా తాను ఈ సినిమా తీయలేనన్నాడు. ‘ఎఫ్-2’లో ప్రేమ, పెళ్లి తదనంతర ఇబ్బందుల మీద కథను నడిపించానని.. కానీ ‘ఎఫ్-3’లో కథ అలా నడవదని.. అందులో హీరో హీరోయిన్ల మధ్య పెళ్లి రిలేషన్ షిప్ చూపించకుండా వాళ్ల కెరీర్.. గోల్స్ మీద కథను నడిపిస్తానని.. ఐతే వినోదానికి మాత్రం అందులోనూ ఢోకా లేకుండా చూసుకుంటానని అనిల్ చెప్పాడు. ‘ఎఫ్-2’ అంటే ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అయితే.. ‘ఎఫ్-3’ అంటే ‘ఫన్, ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్’ అని అనిల్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English