బ్ర‌హ్మి స్పీచ్.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు

బ్ర‌హ్మి స్పీచ్.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు

బ్ర‌హ్మానందం గ్రేట్ క‌మెడియ‌న్ మాత్ర‌మే కాదు.. మంచి స్పీక‌ర్ కూడా. ఆయ‌న ఏదైనా వేడుక‌లో వేదిక ఎక్కితే ఎంతగా అల‌రిస్తారో గ‌తంలో ఎన్నోసార్లు చూశాం. బ్ర‌హ్మి స్పీచ్ అని కొడితే యూట్యూబ్‌లో మంచి వినోదాన్న‌దించే వీడియోలు బోలెడు దొరుకుతాయి. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో ఆయ‌న‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో పాటే ఆయ‌న బ‌య‌ట సినిమా వేడుక‌ల్లో క‌నిపించ‌డ‌మూ త‌గ్గిపోయింది. గ‌త ఏడాది కాలంలో అయితే బ్ర‌హ్మి పూర్తిగా క‌నుమ‌రుగైపోయారు. ఆయ‌న్ని జ‌నం కూడా మ‌రిచిపోయారు ఇలాంటి స‌మ‌యంలో సంక్రాంతి సినిమా అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో రాములో రాములా పాట మ‌ధ్య‌లో బ్ర‌హ్మి త‌ళుక్కుమ‌న‌డం ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఆ పాట‌లో మాత్ర‌మే కాదు.. అల వైకుంఠ‌పుర‌ములో థ్యాంక్స్ మీట్‌లోనూ బ్ర‌హ్మి త‌ళుక్కుమ‌న‌డం, లెంగ్తీ స్పీచ్ ఇవ్వ‌డం ఆయ‌న అభిమానుల‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మి మాట్లాడుతూ.. తాను గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధ ప‌డిన‌ట్లు వెల్ల‌డించాడు. దీంతో పాటు తాను అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో క‌నిపించ‌డం వెనుక క‌థ‌ను కూడా వివ‌రించారు.

"నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. 'అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు' అని చెప్పాడు. ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా. తర్వాత త్రివిక్రమ్ గారొచ్చారు. కొంచెం సేపు మాట్లాడుకున్నాక 'సార్.. మనం కలుస్తున్నాం.. వదిలెయ్యండి ' అన్నారు. వదిలెయ్యమన్నాడు కాబట్టి నేనూ వదిలేశా.

సినిమా అయిపోవచ్చింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు.. ఈ సినిమాలో ఎలాగైనా బ్రహ్మానందం కనిపించాలని నాకు క్యారెక్టర్ ఇచ్చారు." అని బ్ర‌హ్మి అన్నారు. రాములో రాములో పాట హిట్ట‌వ‌డానికి కార‌ణం బ‌న్నీ అని అంద‌రూ అనుకుంటున్నార‌ని.. కానీ అస‌లు కార‌ణం త‌నే అని బ్ర‌హ్మి ఈ సంద‌ర్భంగా చ‌మ‌త్క‌రించ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English