ఆడు మ‌గాడ్రా బుజ్జీ అనిపించుకున్న బ‌న్నీ

ఆడు మ‌గాడ్రా బుజ్జీ అనిపించుకున్న బ‌న్నీ

నా పేరు సూర్య డిజాస్ట‌ర్ కావ‌డంతో షాక్ తిన్న అల్లు అర్జున్.. లేటెస్ట్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములోతో బ‌లంగానే పుంజుకున్నాడు. సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వ‌చ్చిన టాక్, సాధిస్తున్న వ‌సూళ్లు బ‌న్నీకి అప‌రిమిత ఆనందాన్నిస్తున్న‌ట్లే ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా అత‌ను ఏడాదిన్న‌ర‌ కింద‌ట అభిమానుల‌కు త‌న త‌ర్వాతి సినిమా క‌చ్చితంగా స్పెష‌ల్‌గా ఉందంటూ ట్విట్ట‌ర్ ద్వారా హామీ ఇవ్వ‌డాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఓ అభిమాని ఆ ట్వీట్‌ను గుర్తు చేస్తూ ఇచ్చిన రిప్లై గురించి ఈ చిత్ర థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడాడు.

“ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. మై డియరెస్ట్ ఫ్యాన్స్.. థాంక్యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ టు లిటిల్ పేషెన్స్ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్. బికాజ్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యూన్‌లీ డెలివర్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్ టేక్స్ టైం. థాంక్యూ ఫర్ అండర్‌స్టాండింగ్.. ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు” అంటూ మైకును భరణికి ఇచ్చాడు బ‌న్నీ. అప్పుడు భరణి “చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ” అని చదివేసి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు.

బన్నీ కొనసాగిస్తూ.. అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్ అని చెప్పుకొచ్చాడు. తాను, త్రివిక్ర‌మ్ జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నామ‌ని.. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యార‌ని... తాను సినిమా మేకింగ్ సంద‌ర్భంగా ఎన్నిసార్లు డీవియేట్ అయినా త్రివిక్ర‌మ్  ధైర్యమిస్తూ వచ్చార‌ని.. డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ అనుకుంటే.. త‌మ‌ అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అని బ‌న్నీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English