అల్లు అర్జున్‌ కోసం కాదు, త్రివిక్రమ్‌ మహత్యం!

అల్లు అర్జున్‌ కోసం కాదు, త్రివిక్రమ్‌ మహత్యం!

సరిలేరు నీకెవ్వరు గురించి సెలబ్రిటీలు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. పేరున్న హీరోలయితే ఈ చిత్రం గురించి ఎలాంటి ట్వీట్లు పెట్టలేదు. కానీ అల వైకుంఠపురములో చిత్రానికి రిలీజ్‌ అయిన మొదటి రోజే ఎన్టీఆర్‌ మద్దతు లభించింది. తారక్‌ అంత ప్రేమగా ట్వీట్‌ పెట్టడంతో ఆల్రెడీ మహేష్‌కి యాంటీగా వుండే తారక్‌ అభిమానులు 'అల వైకుంఠపురములో'ని ఓన్‌ చేసేసుకున్నారు.

అయితే ఎన్టీఆర్‌ ట్వీట్‌ పెట్టింది బన్నీ కోసం కాదు. అల్లు అర్జున్‌తో సన్నిహిత సంబంధాలే వున్నా కానీ ఈ ట్వీట్‌ మాత్రం త్రివిక్రమ్‌ కోసం పెట్టాడు. తన మలి చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మిస్తారు కనుక ఈ చిత్రానికి తనవంతు సపోర్ట్‌ ఇచ్చాడు. అలాగే 'అల వైకుంఠపురములో' చిత్రం యూనిట్‌కి చాలా వేగంగా కంగ్రాట్స్‌ చెప్పి బొకేలు పంపిన పవన్‌కళ్యాణ్‌ కూడా ఇది బన్నీ కోసం చేయలేదు.

త్రివిక్రమ్‌తో వున్న స్నేహం వల్లే పవన్‌ ఈ చిత్రాన్ని, చిత్ర బృందాన్ని అభినందించాడు. అలాగే ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణతో కూడా పవన్‌కి మంచి రిలేషనే వుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవడంతో ఆ బ్యానర్లో మరో చిత్రం చేయడానికి పవన్‌ కమిట్‌ అయ్యాడు. త్రివిక్రమ్‌ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English