బొమ్మరిల్లు భాస్కర్‌కి జీరో రెమ్యూనరేషన్‌

బొమ్మరిల్లు భాస్కర్‌కి జీరో రెమ్యూనరేషన్‌

జీఏ 2 పిక్చర్స్‌పై వరుస హిట్లు కొడుతోన్న అల్లు అరవింద్‌ - బన్నీ వాస్‌ ద్వయం అంతగా ఫామ్‌లో లేని దర్శకులకి పారితోషికం ఇవ్వకుండా బడ్జెట్‌ని కంట్రోల్‌లో పెడుతున్నారు. 'గీత గోవిందం' చిత్రానికి దర్శకుడు పరశురాం కోటిన్నర పారితోషికం అడిగితే, లాభాల్లో వాటా ఇస్తామని అగ్రిమెంట్‌ రాసుకున్నారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవడంతో పరశురాంకి ఏకంగా తొమ్మిది కోట్లు వచ్చాయి.

అది వేరే విషయం. అలాగే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్‌కి కూడా పారితోషికం లేకుండానే పని చేయించుకుంటున్నారట. అఖిల్‌ హీరోగా తీస్తోన్న సినిమాకి భాస్కర్‌కి కూడా లాభాల్లో ఇరవై శాతం వాటా ఇస్తామన్నారట. దీని వల్ల సినిమా బడ్జెట్‌ తగ్గడమే కాకుండా దర్శకుడు కూడా తప్పకుండా హిట్‌ ఇవ్వాలనే కసితో సినిమా తీస్తాడు.

ఒకవేళ సినిమా ఫెయిలయితే ఎలాగో బడ్జెట్‌లో తీస్తారు కనుక నిర్మాతలు సేఫ్‌గానే వుంటారు. ఫ్లాప్‌ ఇచ్చినందుకు గాను దర్శకుడికి ఏమీ దక్కదు. అగ్ర దర్శకులు, సక్సెస్‌ఫుల్‌ దర్శకులు ఇలాంటి షరతులకి అంగీకరించరు కానీ యువ దర్శకులు, ఫ్లాప్‌ డైరెక్టర్లు ఇలాంటి ఏ కండిషన్‌ పెట్టినా ఒప్పుకుని తీరతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English